KTR: మంచిర్యాల జిల్లాలో మంత్రి కేటీఆర్‌ పర్యటన.. శంకర్‌పల్లిలో ఆయిల్‌పామ్‌ పరిశ్రమకు భూమిపూజ

KTR: ఈసారి కేంద్రంలో సంకీర్ణ ప్రభుత్వమే ఏర్పడుతుంది

Shekhar G
Published on: 1 Oct 2023 1:24 PM IST
Minister Ktr Lays Foundation Stone For Oil Palm Factory In Mandamarri
X

KTR: మంచిర్యాల జిల్లాలో మంత్రి కేటీఆర్‌ పర్యటన.. శంకర్‌పల్లిలో ఆయిల్‌పామ్‌ పరిశ్రమకు భూమిపూజ

KTR: మంచిర్యాల జిల్లాలో మంత్రి కేటీఆర్‌ పర్యటించారు. ఈ సందర్భంగా 312 కోట్ల రూపాయల అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టారు. మందమర్రి క్యాతనపల్లి మున్సిపాలిటీల్లో అభివృద్ధి పనులకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేశారు. వీటితో పాటు 500 కోట్లతో చేపట్టనున్న ఆయిల్‌ పామ్‌ ఫ్యాక్టరీకి భూమిపూజ చేశారు. ఈ సందర‌్భంగా నిర్వహించిన సభలో మంత్రి కేటీఆర్ ప్రధాని మోడీపై విమర‌్శలు చేశారు. మోడీ మనసులో తెలంగాణ లేదన్నారు. కేవలం ఓట్ల వేటకోసమే తెలంగాణ పర్యటనకు వస్తున్నారని విమర్శించారు. ఏపీలో కూడా తట్టెడు మచ్చి వెళ్లిపోయాడే తప్ప.. ఇచ్చింది ఏం లేదన్నారు. తెలంగాణకు కూడా ఇచ్చింది ఏం లేదన్నారు మంత్రి కేటీఆర్. ఈసారి కేంద్రంలో సంకీర్ణ ప్రభుత్వం వస్తుందని జోస్యం చెప్పారు మంత్రి కేటీఆర్.Minister Ktr Lays Foundation Stone For Oil Palm Factory In Mandamarri

Shekhar G

Shekhar G

Next Story