జీనోమ్ వ్యాలీలో జాంప్ ఫార్మాను ప్రారంభించిన మంత్రి కేటీఆర్

Minister KTR: గ్లోబల్ వ్యాకిన్ ఉత్పత్తుల్లో హైదరాబాద్ వాటా 33 శాతం

Rama Rao
Published on: 5 April 2022 4:51 PM IST
Minister KTR Launches Jamp Pharma in Genome Valley | TS News Today
X

జీనోమ్ వ్యాలీలో జాంప్ ఫార్మాను ప్రారంభించిన మంత్రి కేటీఆర్

Minister KTR: ఆకర్షణీయమైన పెట్టుబడులకు జీనోమ్ వ్యాలీ కేంద్రంగా మారిందని మంత్రి కేటీఆర్ అన్నారు. జీనోమ్ వ్యాలీలో జాంప్ ఫార్మాను ప్రారంభించిన కేటీఆర్ కంపెనీల విస్తరణకు హైదరాబాద్‌లో అపార అవకాశాలున్నాయని తెలిపారు. కెనడా తర్వాత హైదరాబాద్‌లోనే జాంప్ పెద్ద బ్రాంచ్‌ను ప్రారంభించిందని చెప్పారు. అహ్మదాబాద్‌ను పరిశీలించిన అనంతరం కంపెనీ హైదరాబాద్‌ను ఎంచుకుందని వివరించారు. అన్ని రకాలుగా ఫార్మా సంస్థలకు జీనోమ్ వ్యాలీ అనువుగా ఉంటుందని, యూనిట్ల స్థాపనకు ఫార్మా కంపెనీలు ముందుకు రావాలన్నారు.

Rama Rao

Rama Rao

Next Story