KTR: సైక్లింగ్‌ ట్రాక్‌కు శంకుస్థాపన చేసిన మంత్రి కేటీఆర్‌

*ORRపై వరల్డ్‌ క్లాస్‌ సోలార్‌ రూఫ్‌ సైక్లింగ్‌ ట్రాక్‌

Jyothi
Published on: 6 Sept 2022 4:25 PM IST
Minister KTR Laid the Foundation Stone for the Cycling Track
X

KTR: సైక్లింగ్‌ ట్రాక్‌కు శంకుస్థాపన చేసిన మంత్రి కేటీఆర్‌

KTR: హైదరాబాద్‌ ఓఆర్ఆర్‌పై అంతర్జాతీయ ప్రమాణాలతో సోలార్ రూఫ్ సైక్లింగ్ ట్రాక్‌ను ఏర్పాటు చేస్తున్నట్లు మంత్రి కేటీఆర్ ప్రకటించారు. ఔటర్ రింగ్‌ రోడ్డుపై దాదాపు 23 కిలోమీటర్ల మేర ఏర్పాటు చేసే సోలార్ రూఫ్ సైక్లింగ్ ట్రాక్‌కు మంత్రి కేటీఆర్ శంకుస్థాపన చేశారు. నానక్ రాంగూడ-కొల్లూరు మధ్యలో ఈ ట్రాక్‌ను ఏర్పాటు చేస్తున్నట్లు మంత్రి తెలిపారు. సోలార్ రూఫ్ వల్ల దాదాపు 16 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి చేసేలా నిర్మాణం ఉంటుందన్నారు. వచ్చే వేసవిలోగా ఈ ట్రాక్‌ నిర్మాణాన్ని పూర్తి చేస్తామని మంత్రి తెలిపారు.

Jyothi

Jyothi

Next Story