కేంద్ర ప్రభుత్వంపై మంత్రి కేటీఆర్ ఆగ్రహం

Minister KTR: ఐటీఐఆర్ ప్రాజెక్టును రద్దు చేశామంటూ..

Sriveni Erugu
Updated on: 29 July 2022 3:21 PM IST
Minister KTR is Angry with the Central Government
X

కేంద్ర ప్రభుత్వంపై మంత్రి కేటీఆర్ ఆగ్రహం

Minister KTR: కేంద్ర ప్రభుత్వంపై మంత్రి కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ITIR ప్రాజెక్టును రద్దు చేశామంటూ పార్లమెంట్‌లో కేంద్రం చేసిన ప్రకటన సిగ్గుచేటన్నారు. సంకుంచిత రాజకీయాల కోసమే ITIR రద్దు చేశారని ఆరోపించారు. ITIR స్థాయిలో తెలంగాణకు పలు ప్రాజెక్టులు మంజూరు చేశామని పార్లమెంటులో కేంద్రం నిస్సిగ్గుగా చెప్పి దేశ ప్రజలను మోసం చేసిందని దుయ్యబట్టారు. బీజేపీ డీఎన్‌ఏలో ఉన్న అసత్యాలు, అవాస్తవాలను కేంద్రమంత్రి రాజీవ్‌ చంద్రశేఖర్‌ వల్లెవేశారని మంత్రి కేటీఆర్ మండిపడ్డారు. ITIR ప్రాజెక్టుకు సమాన స్థాయిలో హైదరాబాద్‌ ఐటీకి అవసరమైన ఏదైనా పథకాన్ని ప్రకటించాలని కనీసం 50 సార్లు కేంద్రాన్ని కోరామని కేటీఆర్ గుర్తుచేశారు. అయినా మోడీ ప్రభుత్వం హైదరాబాద్ ఐటీ ఈకో సిస్టమ్‌కు పైసా సాయం చేయలేదన్నారు.


Sriveni Erugu

Sriveni Erugu

Next Story