KTR: భూపాలపల్లి జిల్లా కలెక్టరేట్‌ను ప్రారంభించిన మంత్రి కేటీఆర్‌

KTR: ఇతర రాష్ట్రాల్లో సెక్రటేరియేట్లు మన కలెక్టరేట్‌ల్లాగా కూడా లేవన్న కేటీఆర్

Shekhar G
Published on: 9 Oct 2023 12:03 PM IST
Minister KTR Inaugurates Bhupalpally Collectorate
X

KTR: భూపాలపల్లి జిల్లా కలెక్టరేట్‌ను ప్రారంభించిన మంత్రి కేటీఆర్‌

KTR: తలసరి ఆదాయంలో తెలంగాణ నెంబర్ వన్ స్థానంలో ఉందని మంత్రి కేటీఆర్ అన్నారు. జయశంకర్ భూపాలపల్లిలో కలెక్టరేట్‌, ఎస్పీ కార్యాలయాన్ని కేటీఆర్ ప్రారంభించారు. ప్రొఫెసర్ జయశంకర్ పేరుతో ఏర్పడిన జిల్లాకు చెందిన కలెక్టరేట్, ఎస్పీ కార్యాలయాలను ప్రారంభించడం తన అదృష్టంగా భావిస్తున్నానన్నారు. తెలంగాణ ఏర్పడక ముందు రాష్ట్రం ఎలా ఉందో ఇప్పుడు ఎలా ఉందో ప్రజలు చూస్తున్నారని మంత్రి కేటీఆర్ అన్నారు. రాష్ట్రంలో జరిగిన అభివృద్ధిని చూసి ప్రజలే తమను ఆశీర్వదిస్తారని మంత్రి కేటీఆర్ అన్నారు.

Shekhar G

Shekhar G

Next Story