Balanagar Flyover: బాలానగర్‌ ఫ్లై ఓవర్‌ను ప్రారంభించిన మంత్రి కేటీఆర్‌

Minister KTR Inaugurated the Balanagar Flyover in Hyderabad
x

బాలానగర్ ఫ్లైఓవర్ ప్రారంభించిన మంత్రి కేటీఅర్ 

Highlights

KTR - Balanagar Flyover: బాబు జగ్జీవన్‌‍రామ్‌ ఫ్లైఓవర్‌గా నామకరణం * రూ.387 కోట్లతో 1.13 కి.మీ, 24 మీ.వెడల్పుతో ఫ్లై ఓవర్‌

KTR - Balanagar Flyover: ట్రాఫిక్‌ లెస్‌ సిటీగా హైదరాబాద్ దూసుకెళ్తోంది. ట్రాఫిక్‌ సమస్యను అధిగమించేందుకు ఇప్పటికే నగరంలో ఎన్నో ఫ్లై ఓవర్ల నిర్మాణం చేపట్టిన ప్రభుత్వం.. తాజాగా.. బాలానగర్‌ ప్రజల చిరకాల స్వప్నాన్ని నెరవేర్చింది. ట్రాఫిక్‌ కష్టాల నుంచి అక్కడి ప్రజలను బయటపడేసింది. బాలానగర్‌లో నిర్మించిన ఫ్లై ఓవర్‌ను నేటి నుంచి అందుబాటులోకి తీసుకొచ్చింది.

2017 ఆగస్టు 21న బాలానగర్‌ ఫ్లై ఓవర్‌ నిర్మాణ పనులకు మంత్రి కేటీఆర్‌ శంకుస్థాపన చేయగా.. ఇవాళ ఆయన చేతుల మీదుగానే ఫ్లై ఓవర్‌ ప్రారంభం జరిగింది. 3వందల 87 కోట్ల ఖర్చుతో 1.13 కిలోమీటర్ల పొడవు, 24 మీటర్ల వెడల్పు, 6 లైన్లు, 26 పిల్లర్లతో 4ఏళ్లలో ఫ్లై ఓవర్‌ నిర్మాణం జరిగింది. ఈ ఫ్లైఓవర్‌కు బాబు జగ్జీవన్‌రామ్‌ ఫ్లైఓవర్‌గా నామకరణం చేశారు. ఫ్లైఓవర్‌ నిర్మాణంతో బాలానగర్‌ మీదుగా కూకట్‌పల్లి, జీడిమెట్ల, సికింద్రాబాద్‌ మార్గంలో వెళ్లేవారికి ట్రాఫిక్‌ కష్టాలు తీరనున్నాయి.

సీఎం కేసీఆర్‌ హయాంలో ఒక్కొక్క అడుగు వేస్తూ.. విశ్వనగరంగా హైదరాబాద్‌ అభివృద్ధి చెందుతోందని అన్నారు మంత్రి కేటీఆర్‌. ఫ్లై ఓవర్‌ నిర్మాణానికి 387 కోట్లు కేటాయించగా.. 270 కోట్లతోనే నిర్మాణం పూర్తయిందని అన్నా మంత్రి.. మిగిలిన నిధులతో రహదారిని విస్తరిస్తామని చెప్పారు. అలాగే.. బాచుపల్లి రహదారి విస్తరణ పనులు కూడా చేపడతామన్నారు. ప్యాట్నీ నుంచి సుచిత్ర, జేబీఎస్‌ నుంచి తుర్కపల్లి వరకు స్కైవే ఆలోచన ఉందని, కేంద్రం నుంచి సహాయం కరువైనందున ఆలస్యమవుతోందని అన్నారు మంత్రి కేటీఆర్‌.

Show Full Article
Print Article
Next Story
More Stories