KTR: ఎన్టీఆర్‌ హ్యాట్రిక్‌ కొట్టలేకపోయారు.. ఆయన శిష్యుడు సీఎం కేసీఆర్‌ హ్యాట్రిక్‌ కొడతారు

KTR: ఎందరొచ్చినా ఎన్టీఆర్‌కు సాటిలేరు

Shekhar G
Published on: 30 Sept 2023 12:30 PM IST
Minister KTR Inaugurated NTR Garden In Khammam
X

KTR: ఎన్టీఆర్‌ హ్యాట్రిక్‌ కొట్టలేకపోయారు.. ఆయన శిష్యుడు సీఎం కేసీఆర్‌ హ్యాట్రిక్‌ కొడతారు

KTR: ఆ పేరులోనే 'పవర్‌' ఉంది..రాముడు, కృష్ణుడు ఎలా ఉంటారో మనకు తెలియదని, కానీ ఎన్టీఆర్‌లాగే ఉంటారనుకునేవాళ్లమని అన్నారు మంత్రి కేటీఆర్‌. ప్రపంచ వ్యాప్తంగా తెలుగువారికి ఎన్టీఆర్‌ ఆదర్శమని, ఎందరొచ్చినా ఎన్టీఆర్‌కు సాటిరారని మంత్రి కేటీఆర్‌ చెప్పారు. అలాంటి వ్యక్తి విగ్రహాన్ని ఆవిష్కరించే అవకాశం.. తనకు కల్పించడంపై ధన్యవాదాలు తెలిపారు. తారక రామారావు అనే పేరులోనే ఏదో పవర్‌ ఉందని మంత్రి కేటీఆర్‌ అన్నారు. ఇక.. ముఖ్యమంత్రిగా ఎన్టీఆర్‌ హ్యాట్రిక్‌ కొట్టలేకపోయారని, కానీ.. ఆయన శిష్యుడు కేసీఆర్.. వచ్చే ఎన్నికల్లో గెలిచి హ్యాట్రిక్ కొట్టబోతున్నారని ధీమా వ్యక్తం చేశారు మంత్రి కేటీఆర్. ఖమ్మంలో ఎన్టీఆర్‌ గార్డెన్‌ను మంత్రి కేటీఆర్‌ ప్రారంభించారు. అనంతరం.. ఎన్టీఆర్‌ భారీ విగ్రహాన్ని ఆయన ఆవిష్కరించారు.

Shekhar G

Shekhar G

Next Story