KTR: డీకే శివకుమార్‌పై మంత్రి కేటీఆర్ ఫైర్

Minister KTR Fire on DK Shivakumar
x

KTR: డీకే శివకుమార్‌పై మంత్రి కేటీఆర్ ఫైర్

Highlights

KTR: కాంగ్రెస్‌కు అధికారం ఇస్తే అంధకారమేనని.. తెలంగాణ ప్రజలకు అర్ధమైంది

KTR: డీకే శివకుమార్‌పై ట్విట్టర్ ద్వారా మంత్రి కేటీఆర్ ఫైర్ అయ్యారు. కాంగ్రెస్‌కు అధికారం ఇస్తే అంధకారమే అని తెలంగాణ ప్రజలకు అర్ధమైందని మంత్రి కేటీఆర్ అన్నారు. 24 గంటల ఉచిత విద్యుత్ అందిస్తున్న తెలంగాణకు వచ్చి.... కర్ణాటకలో 5 గంటల కరెంట్ ఇస్తున్నామని గొప్పగా చెప్పుకోవడం సిగ్గుచేటని... అది మీ చేతకానితనానికి నిదర్శనమన్నారు. కాంగ్రెస్ వైఫల్యాలను చూడటానికి కర్ణాటకకు వెళ్లాల్సిన అవసరం లేదని.. మీ చేతితో దగా పడ్డ రైతులు ఇక్కడికి వచ్చి మీరు చేసిన అన్యాయాన్ని ప్రజలకు వివరిస్తున్నారన్నారు. ప్రజలు కాంగ్రెస్ పార్టీని నమ్మే పరిస్థితిలో లేరని ఆయన ట్విట్టర్ వేదికగా మండిపడ్డారు. కర్ణాటక ప్రజలు పుట్టెడు కష్టాలతో ఇబ్బంది పడుతుంటే పట్టించుకోకుండా తెలంగాణలో ఓట్ల వేటకొచ్చారా అని ఆయన ప్రశ్నించారు.

Show Full Article
Print Article
Next Story
More Stories