Minister KTR: రేవంత్‌పై పరువు నష్టం దావా పిటిషన్‌ వేసిన కేటీఆర్‌

Minister KTR: సిటీ సివిల్‌ కోర్టులో రేవంత్‌పై రూ.కోటికి పరువు నష్టం దావా

Sandeep Eggoju
Published on: 21 Sept 2021 1:44 PM IST
Minister KTR Filed Defamation Suit petition‌ on Revanth Reddy
X
రేవంత్ రెడ్డి పై పరువు నష్టం దావా వేసిన మంత్రి కేటీఆర్ (ఫైల్ ఇమేజ్)

Minister KTR: సిటీ సివిల్‌ కోర్టులో టీపీసీసీ చీఫ్‌ రేవంత్‌రెడ్డిపై పరువునష్టం దావా పిటిషన్‌ దాఖలు చేశారు మంత్రి కేటీఆర్. 39 రూల్‌ 1,2, రెడ్‌విత్‌ 151, CPC ప్రకారం పరువు నష్టం దావా వేసిన మంత్రి కేటీఆర్.. కోటి రూపాయలకు పరువు నష్టం దావా వేశారు. కోర్టు ఫీజుగా లక్షా 29వేలను చెల్లించారు. నిన్న వేసిన పిటిషన్‌ను విత్‌ ఎవిడెన్స్‌తో సబ్మిట్‌ చేసిన కేటీఆర్.. సిటీ సివిల్‌ కోర్టులో మరోసారి రీ పిటిషన్‌ వేశారు. ప్రింట్‌ అండ్‌ ఎలక్ట్రానిక్‌ మీడియా, సోషల్‌ మీడియాలో తనకు సంబంధించిన వార్తలను ప్రసారం చేయొద్దని కోరారు కేటీఆర్. అలాగే.. రేవంత్‌ చేసే అసభ్యకరమైన వ్యాఖ్యలను నియంత్రించాలని విన్నవించారు.

Sandeep Eggoju

Sandeep Eggoju

Next Story