KTR: 950 మంది టీఆర్ఎస్ కార్యకర్తల కుటుంబాలకు సాయం అందిస్తాం

KTR: వివిధ కారణాలతో మరణించిన టీఆర్ఎస్ కార్యకర్తల కుటుంబాలకు తెలంగాణ భవన్‌లో చెక్కులు పంపిణీ కార్యక్రమం జరిగింది.

Arun Chilukuri
Published on: 4 Aug 2021 4:41 PM IST
Minister KTR Distributes Insurance Cheques To Families Of Deceased TRS Members In Telangana Bhavan
X

KTR: 950 మంది టీఆర్ఎస్ కార్యకర్తల కుటుంబాలకు సాయం అందిస్తాం

KTR: వివిధ కారణాలతో మరణించిన టీఆర్ఎస్ కార్యకర్తల కుటుంబాలకు తెలంగాణ భవన్‌లో చెక్కులు పంపిణీ కార్యక్రమం జరిగింది. పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చేతుల మీదుగా ఇన్సూరెన్స్ చెక్కులను కార్యకర్తల కుటుంబాలకు అందించారు. చనిపోయిన 80మంది కార్యకర్తల కుటుంబాలకు చెక్కులు అందించిన కేటీఆర్ టీఆర్ఎస్ కార్యకర్తలకు పార్టీ అన్ని విధాలుగా అండగా ఉంటుందని హామీ ఇచ్చారు.

ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ కార్యకర్తల కుటుంబాలతో కలిసి సహపంక్తి భోజనం చేశారు. 18 కోట్ల పైచిలుకు రూపాయాల‌ను ఇన్సూరెన్స్ క‌డుతున్నామ‌ని చెప్పారు. 950 మంది పార్టీ నాయ‌కులు, కార్య‌క‌ర్త‌లు వివిధ ప్ర‌మాదాల్లో దుర్మ‌ర‌ణం పాల‌య్యారు. ఈ కుటుంబాల యొక్క బాగోగులు చూసుకోవాల్సిన బాధ్య‌త పార్టీ జ‌న‌ర‌ల్ సెక్ర‌ట‌రీల‌తో పాటు ఎమ్మెల్యేలదే అని తెలిపారు. వీరంద‌రికి త్వ‌ర‌లోనే సాయం చేస్తామ‌న్నారు. కేసీఆర్ నాయ‌క‌త్వంలో మ‌నంద‌రం ముందుకు పోదామ‌ని పిలుపునిచ్చారు. వారం ప‌ది రోజుల్లోనే పిలిచి.. మీ స‌మ‌స్య‌ల‌ను ప‌రిష్కారిస్తామ‌ని కేటీఆర్ తెలిపారు.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story