అవసరమైతే కిడ్నీ ఇస్తా.. మంత్రి కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు.. బండి సంజయ్ తన చెప్పుతో..

KTR: డ్రగ్స్‌ టెస్ట్‌ కోసం నా రక్తం కిడ్నీ కూడా ఇస్తా.. మీకు ఏది కావాలంటే అది ఇస్తా టెస్ట్‌ చేసుకోండి

R Tripura Malini
Published on: 20 Dec 2022 5:41 PM IST
Minister KTR  Counter To Bandi Sanjay
X

బండి సంజయ్‌కు మంత్రి కేటీఆర్ కౌంటర్

KTR: బండి సంజయ్‌కు మంత్రి కేటీఆర్ స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. డ్రగ్స్‌ టెస్ట్‌ కోసం తన రక్తం, కిడ్నీ కూడా ఇస్తానన్నారు. క్లీన్‌ చిట్‌తో బయటకు వస్తానన్న మంత్రి కేటీఆర్ కరీంనగర్‌ చౌరస్తాలో బండి సంజయ్ తన చెప్పుతో తానే కొట్టుకుంటాడా అని సవాల్ విసిరారు కేటీఆర్. రాజకీయంగా ఎదుర్కొలేక వేట కుక్కలను వదులుతున్నారని మంత్రి కేటీఆర్‌ ఆరోపించారు. తనపై ఎన్ని ఆరోపణలు చేసినా.. అవ్వన్నీ అవాస్తవమేనని, క్లీన్‌ చిట్‌తో బయటకు వస్తానన్నారు. తాను పరీక్షల కోసం శాంపిల్స్‌ ఇస్తానని, అదే సమయంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీని ఇమ్మని కోరతానని కీలక వ్యాఖ్యలు చేశారు.

R Tripura Malini

R Tripura Malini

Next Story