KTR: కరీంనగర్ పర్యటనలో బండి సంజయ్‌కు కేటీఆర్ సవాల్

KTR: మంత్రి గంగులపై పోటీ చేసి గెలవాలని బండికి కేటీఆర్ సవాల్

Rama Rao
Updated on: 17 March 2022 4:15 PM IST
Minister KTR Comments on BJP Chief Bandi Sanjay | TS News Today
X

కరీంనగర్ పర్యటనలో బండి సంజయ్‌కు కేటీఆర్ సవాల్

KTR: కరీంనగర్ పర్యటనలో మంత్రి కేటీఆర్‌ బీజేపీ చీఫ్ బండి సంజయ్‌కు సవాళ్ల మీద సవాళ్లు విసిరారు. డబుల్ ఇంజిన్ గవర్నమెంట్ కావాలని కోరుతున్న బండి సంజయ్ కరీంనగర్ బీజేపీ ఎంపీగా ప్రధానమంత్రితో ఏం పనులు చేయించారో చెప్పాలని డిమాండ్ చేశారు కేటీఆర్. కాళేశ్వరం ప్రాజెక్టుకు జాతీయ హోదా కోసం పార్లమెంట్‌లో కొట్లాడలేని ఎంపీ బండి అని విమర్శించారు. దమ్ముంటే బండి సంజయ్ మంత్రి గంగులపై పోటీ చేసి గెలువాలని సవాల్ విసిరారు మంత్రి కేటీఆర్. మాట్లాడితే చాలు హిందువు హిందువు అని రెచ్చగొట్టే బండి సంజయ్ కనీసం కరీంనగర్‌లో టీటీడీ గుడి తెప్పించలేకపోయారని ఎద్దేవా చేశారు మినిస్టర్ కేటీఆర్.

Rama Rao

Rama Rao

Next Story