Minister KTR: బీజేపీ దేశాన్ని రావణకాష్టంగా మారుస్తుంది వ్యాఖ్య

Minister KTR: అభివృద్ధే కులంగా, సంక్షేమమే మతంగా టీఆర్ఎస్ ముందుకెళుతుందన్న మంత్రి కేటీఆర్

Rama Rao
Published on: 18 Jun 2022 2:32 PM IST
Minister KTR Comments on BJP and Congress | TS News
X

Minister KTR: బీజేపీ దేశాన్ని రావణకాష్టంగా మారుస్తుంది వ్యాఖ్య

Minister KTR: కుల, మత రాజకీయాలతో కాంగ్రెస్, బీజేపీలు రాష్ట్రాన్ని రావణకాష్టం చేశారని మంత్రి కేటీఆర్ మండిపడ్డారు. హంతకుడే సంతాపం తెలిపినట్లు కాంగ్రెస్‌ పార్టీ ఒక్క ఛాన్స్ అడుగుతోందని అన్నారు. మరోవైపు అనాలోచిత విధానాలతో బీజేపీ కేంద్ర ప్రభుత్వం దేశాన్ని నాశనం చేస్తుందని విమర్శించారు. నాగర్ కర్నూలు జిల్లా కొల్లాపూర్‌లో జరిగిన పల్లెప్రగతి కార్యక్రమంలో మంత్రి కేటీఆర్ పాల్గొన్నారు. 177 కోట్లతో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన, ప్రారంభోత్సవాలు చేశారు. అభివృద్దే కులంగా, సంక్షేమమే మతంగా, జనహితమే లక్ష్యంగా ముందుకెళుతున్న టీఆర్ఎస్ పార్టీకి అండగా ఉండాలని కోరారు.

Rama Rao

Rama Rao

Next Story