KTR: బీజేపీ, కాంగ్రెస్‌లపై మంత్రి కేటీఆర్ విమర్శలు

KTR: కృష్ణా జలాల విషయంలో టీఆర్‌ఎస్‌ అనుకున్నది సాధిస్తుంది: కేటీఆర్

Sandeep Eggoju
Published on: 12 July 2021 3:37 PM IST
Minister KTR Comments on BJP And Congress
X
మంత్రి కేటీఆర్ (ఫైల్ ఇమేజ్)

KTR: తెలంగాణ పురపాలకశాఖ మంత్రి కేటీఆర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. హైదరాబాద్‌కు చెందిన వివిధ మున్సిపాలిటీల కాంగ్రెస్‌ కార్పొరేటర్లు కేటీఆర్ సమక్షంలో టీఆర్‌ఎస్‌లో చేరారు. పలువురు నేతలను పార్టీలోకి వెల్‌కమ్ చేసిన కేటీఆర్ కొందరు నేతలు కోతికి కొబ్బరిచిప్ప దొరికినట్లు ఎగిరెగిరి పడుతున్నారని అలాంటి వారిని పట్టించుకోవాల్సిన అవసరం లేదని వ్యాఖ్యానించారు. సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్న నేతలు సైతం టీఆర్‌ఎస్‌ వైపు చూస్తున్నారన్నారు. కాంగ్రెస్, బీజేపీలకు అన్ని రాష్ట్రాల్లో రాజకీయాలు కావాలన్నారు. కానీ, టీఆర్‌ఎస్‌ మాత్రం ఒకే ఒక్క రాష్ట్రం అదే తెలంగాణ అన్నారు. అటు.. కృష్ణా జలాల విషయంలో టీఆర్‌ఎస్‌ అనుకున్నది సాధిస్తుందని కేటీఆర్‌ పేర్కొన్నారు.

Sandeep Eggoju

Sandeep Eggoju

Next Story