KTR: నల్లగొండకు 18 వేల కోట్లు ఇస్తారా?.. పోటీ నుంచి తప్పుకుంటాం..

KTR: మా తెలంగాణకు కనీసం రూ.18వేల కోట్లు ఇవ్వలేరా..?

Jyothi
Updated on: 12 Oct 2022 1:25 PM IST
Minister KTR Comments on BJP
X

KTR: ఓ వ్యక్తి ప్రపంచ కుబేరుడు అయితే దేశ సంపద పెరగదు

KTR: నల్గొండ జిల్లాకు 18వేల కోట్ల రూపాయల ప్యాకేజీ ప్రకటిస్తే పోటీ నుంచి తప్పుకుంటామని.. అందుకు బీజేపీ సిద్ధమా అని మంత్రి కేటీఆర్ కేంద్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. రాజకీయ ప్రయోజనం కాదు... నల్లగొండ ప్రజల ప్రయోజనం ముఖ్యమని అన్నారు. ఈ మేరకు ఆయన ట్వీట్‌ చేశారు. ఒక వ్యక్తి ప్రపంచ కుబేరుడు అయితే దేశం సంపద పెరగదు... మరో వ్యక్తికి కాంట్రాక్టు ఇస్తే జిల్లా బాగుపడదు... గుజరాత్‌కు గత ఐదు నెలల్లో 80 వేల కోట్ల ప్యాకేజీలు... తెలంగాణకు కనీసం 18వేల కోట్లు ఇవ్వలేరా అంటూ మంత్రి కేటీఆర్ ప్రశ్నించారు. నీతి ఆయోగ్‌ ఫ్లోరోసిస్‌ నిర్మూలన కోసం మిషన్‌ భగీరథకి 19వేల కోట్లు కేటాయించామని సిఫార్సు చేస్తే పెడచెవిన పెట్టారని... రాజకీయ ప్రయోజనం కోసం ఓ వ్యక్తికి 18వేల కోట్ల కాంట్రాక్టు ఇచ్చారన్నారు. ప్రధాని మోడీ ఇప్పటికైనా నల్లగొండ జిల్లాకు 18వేల కోట్ల ప్యాకేజీ ప్రకటిస్తే పోటీనుంచి తప్పుకుంటామని... ఈ సవాల్‌కు బీజేపీ సిద్ధమా..? అని మంత్రి కేటీఆర్‌ ట్వీట్ చేశారు.


Jyothi

Jyothi

Next Story