3 వారాల విశ్రాంతి తర్వాత బయటకొచ్చిన మంత్రి కేటీఆర్

Minister KTR: పరేడ్ గ్రౌండ్స్ లో జరిగిన 'ఆజాదీకా అమృత్ మహోత్సవ్' కార్యక్రమానికి హాజరు

Sriveni Erugu
Updated on: 14 Aug 2022 7:31 PM IST
Minister KTR  Came Out After  Three Weeks Rest
X

3 వారాల విశ్రాంతి తర్వాత బయటకొచ్చిన మంత్రి కేటీఆర్

Minister KTR: టిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ తన మూడు వారాల విశ్రాంతి తర్వాత బయటకొచ్చారు. భారత సైన్యం ఆధ్వర్యంలో పరేడ్ గ్రౌండ్స్‌లో జరిగిన 'ఆజాదీ కా అమృత్ మహోత్సవ్'లో ఆయన పాల్గొన్నారు. సభా వేదిక వద్దకు మంత్రి చేరుకోగానే, భారత సైన్యానికి చెందిన సీనియర్ అధికారులు ఘన స్వాగతం పలికి స్టేజీ వద్ద కు తీసుకెళ్లారు. తన వాకింగ్ స్టిక్ , ప్రత్యేక షూతో మంత్రి కేటీఆర్ ముందుకు నడిచారు.

అయితే జూలై 23న మహీంద్రా యూనివర్శిటీ కాన్వొకేషన్‌లో పాల్గొనడానికి వెళ్లడానికి ముందు తీవ్రమైన నొప్పితో యశోద ఆసుపత్రికి వెళ్లారు. దీంతో మంత్రి కేటీఆర్ ను పరిశీలించిన వైద్యులు. లిగమెంట్‎ టియర్‌తో బాధపడుతున్నట్లు గుర్తించారు. మూడు వారాల విశ్రాంతి తీసుకోవాలని సూచించారు. వైద్యుల సహాల మేరకు మూడు వారాల పాటు విశ్రాంతి తీసుకున్న ఆయన తొలిసారిగా అధికార కార్యక్రమాలకు హాజరయ్యారు.

Sriveni Erugu

Sriveni Erugu

Next Story