తెలంగాణలో ముందస్తు ఎన్నికల మూడ్.. టీఆర్ఎస్ అభ్యర్థుల ప్రకటన మొదలైనట్లేనా?

Gangula Kamalakar: తెలంగాణలో ముందస్తు ఎన్నికల మూడ్ వచ్చినట్లేనా?

Arun Chilukuri
Published on: 17 March 2022 5:13 PM IST
Minister KTR Announce Karimnagar TRS Candidate
X

తెలంగాణలో ముందస్తు ఎన్నికల మూడ్.. టీఆర్ఎస్ అభ్యర్థుల ప్రకటన మొదలైనట్లేనా?

Gangula Kamalakar: తెలంగాణలో ముందస్తు ఎన్నికల మూడ్ వచ్చినట్లేనా? అధికార టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థుల ప్రకటన మొదలైనట్లేనా? కరీంనగర్ పర్యటనలో బండి సంజయ్‌కు సవాల్ విసిరిన కేటీఆర్.. రాబోయో ఎన్నికల్లో తమ అభ్యర్థి గంగుల కమలాకర్ అని చెప్పకనే చెప్పారా? గత ఎన్నికల్లోనూ ఎలగందుల సభకు వచ్చిన కేటీఆర్ అప్పట్లో తమ అభ్యర్థి గంగుల కమలాకరే అని చెప్పకనే చెప్పారు.

తాజాగా మానేర్ రివర్ ఫ్రంట్ శంఖుస్థాపనకు వచ్చిన కేటీఆర్ బండి సంజయ్‌కు సవాల్ విసిరారు. దమ్ముంటే మంత్రి గంగులపై పోటీ చేసి గెలవాలని సవాల్ విసిరారు. దీంతో వచ్చే ఎన్నికల్లో కరీంనగర్ అసెంబ్లీ టీఆర్ఎస్ టికెట్ మంత్రి గంగులకే అనే ప్రచారం మొదలైంది. ఇప్పటికే వరుస విజయాలు సాధిస్తూ వస్తున్న గంగుల కమలాకర్ అభిమానులు మంత్రి ప్రకటనతో సంబరాలు చేసుకుంటున్నారు.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story