యశోద ఆస్పత్రికి చేరుకున్న కేటీఆర్, హరీశ్ రావు.. కేసీఆర్‌ ఆరోగ్య పరిస్థితిపై డాక్టర్ కీలక ప్రకటన..

Minister KTR and Harish Rao Visits Yashoda Hospital For KCR | Breaking News
x

యశోద ఆస్పత్రికి చేరుకున్న కేటీఆర్, హరీశ్ రావు.. కేసీఆర్‌ ఆరోగ్య పరిస్థితిపై డాక్టర్ కీలక ప్రకటన..

Highlights

CM KCR Visits Yashoda Hospital: సీఎం కేసీఆర్‌ స్వల్ప అస్వస్థతకు గురయ్యారు...

CM KCR Visits Yashoda Hospital: సీఎం కేసీఆర్‌ స్వల్ప అస్వస్థతకు గురయ్యారు. కేసీఆర్ సోమాజీగూడాలోని యశోద ఆస్పత్రికి వెళ్లారు. కేసీఆర్‌ ఎడమ చేయి లాగుతున్నట్లు చెప్పారని యశోద ఆస్పత్రి వైద్యుడు డా.ఎంవీ రావు తెలిపారు. ప్రాథమిక పరీక్షల అనంతరం యాంజియోగ్రామ్‌ నిర్వహించినట్లు వెల్లడించారు. సాధారణ చెకప్‌లో భాగంగా అన్ని పరీక్షలు నిర్వహిస్తామని చెప్పారు. సీఎం కేసీఆర్‌ ఆరోగ్యంగా ఉన్నట్లు తెలిపారు.

ఇదిలా ఉంటే.. మంత్రి కేటీఆర్ ఉప్పల్‌ నియోజకవర్గ పరిధిలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేయడానికి వెళ్లారు. విషయం తెలిసిన వెంటనే కేటీఆర్ అక్కడ్నుంచి ఆస్పత్రికి బయల్దేరారని తెలుస్తోంది. కొద్దిసేపటి క్రితమే మంత్రి హరీశ్ రావు ఆస్పత్రికి చేరుకున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories