Municipal Elections 2026: నల్లగొండ అభివృద్ధి నా బాధ్యత: ఓటు వేసిన మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి!

Municipal Elections 2026: నల్లగొండ జిల్లా పబ్లిక్‌ స్కూల్‌లో మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి తన ఓటు హక్కును వినియోగించుకున్నారు.

Arun Chilukuri
Published on: 11 Feb 2026 11:25 AM IST
Municipal Elections 2026: నల్లగొండ అభివృద్ధి నా బాధ్యత: ఓటు వేసిన మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి!
X

Municipal Elections 2026: నల్లగొండ జిల్లా పబ్లిక్‌ స్కూల్‌లో మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. నల్గొండలో ఒక సంవత్సరం తర్వాత ప్రజలు ఊహించని అభివృద్ధి జరుగుతుందని ఆయన అన్నారు. జిల్లా పరిధిలోని పలు దేవాలయాలను పున:నిర్మిస్తామని మంత్రి తెలిపారు. 200 కోట్ల రూపాయలతో ఎంజి యూనివర్సిటీలో ఆధునిక టెక్నాలజీ కోసం నిధులు కేటాయించామన్నారు. నల్గొండ ప్రజలందరిని తన గుండెల్లో పెట్టుకొని చూసుకుంటానని హామి ఇచ్చారు. ప్రతి ‎ఒక్కరూ తమ ఓటు హక్కును తప్పకుండా వినియోగించుకోవాలని మంత్రి కోమటిరెడ్డి సూచించారు.


Arun Chilukuri

Arun Chilukuri

వెబ్ జర్నలిస్ట్ గా నా కెరీర్ HMTV ద్వారా పదేళ్ల క్రితం ప్రారంభం అయింది. పదేళ్లుగా HMTV లోనే వెబ్సైట్ కు ఆర్టికల్స్ రాస్తున్నాను. దాదాపుగా అన్ని కేటగిరీల్లోనూ ముఖ్యంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల వార్తలతో పాటు వివిధ కేటగిరీల్లో అవసరాన్ని బట్టి ఆర్టికల్స్, బ్రేకింగ్ న్యూస్ ను ఇవ్వడం చేస్తున్నాను.

Next Story