Covid vaccine: వ్యాక్సిన్ తీసుకునేందుకు ఎవరూ భయపడొద్దు: కిషన్‌రెడ్డి

Arun Chilukuri
Published on: 2 March 2021 12:01 PM IST
Minister Kishan Reddy gets first dose of Covid vaccine
X

వ్యాక్సిన్ తీసుకునేందుకు ఎవరూ భయపడొద్దు: కిషన్‌రెడ్డి

Covid vaccine: దేశవ్యాప్తంగా రెండో విడత కరోనా వ్యాక్సినేషన్‌ కొనసాగుతోంది. పలువురు రాజకీయ ప్రముఖులు టీకా తీసుకుంటున్నారు. కేంద్ర హోంశాఖ స‌హాయ‌మంత్రి జీ కిష‌న్ రెడ్డి ఇవాళ కోవిడ్ టీకా వేయించుకున్నారు. హైద‌రాబాద్‌లోని గాంధీ ద‌వాఖానాలో ఆయ‌న తొలి డోసు టీకా తీసుకున్నారు. కోవిడ్‌ వ్యాక్సిన్‌ తీసుకున్నా.. కరోనా నిబంధనలు కచ్చితంగా పాటించాలని సూచించారు కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి.

కరోనా మహమ్మారిని సమర్థవంతంగా ఎదుర్కొంటున్నామని, అన్ని రకాల జాగ్రత్తలు తీసుకొని కొవిడ్‌ను జయించాలని ఆయన అన్నారు. వ్యాక్సిన్‌ తీసుకునేందుకు భయపడాల్సిన అవసరం లేదని చెప్పారు కిషన్‌రెడ్డి. కేంద్ర మంత్రి కిష‌న్ రెడ్డి టీకా తీసుకునే స‌మ‌యంలో తెలంగాణ మంత్రి ఈటెల రాజేంద‌ర్ కూడా అక్క‌డే ఉన్నారు. హైద‌రాబాద్‌లోని భార‌త్‌బ‌యోటెక్ సంస్థ రూపొందించిన కోవాగ్జిన్ టీకాను ఆయ‌న వేయించుకున్నారు.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story