Jagadish Reddy: జలయజ్ఞం పేరుతో తెలంగాణ జలాలను వైఎస్ దోపిడీ చేశారు

Jagadish Reddy: ఏపీ ప్రభుత్వం అక్రమంగా ప్రాజెక్టుల నిర్మాణం చేపడుతోందని, తద్వారా తెలంగాణకు తీవ్ర నష్టం వాటిల్లనుందని మండిపడ్డారు మంత్రి జగదీష్‌రెడ్డి.

Arun Chilukuri
Updated on: 25 Jun 2021 9:00 PM IST
Minister Jagadish Reddy Slams YS Rajasekhar Reddy
X

జగదీష్‌ రెడ్డి(ఫైల్ ఇమేజ్ )

Jagadish Reddy: ఏపీ ప్రభుత్వం అక్రమంగా ప్రాజెక్టుల నిర్మాణం చేపడుతోందని, తద్వారా తెలంగాణకు తీవ్ర నష్టం వాటిల్లనుందని మండిపడ్డారు మంత్రి జగదీష్‌రెడ్డి. ఏపీ అక్రమ ప్రాజెక్టులపై అపెక్స్‌ కమిటీ, కేంద్రానికి మా అభ్యంతరాలు తెలియజేశామన్న మంత్రి కోర్టు ఉత్తర్వులను ఏపీ ప్రభుత్వం లెక్కచేయట్లేదని ఫైర్‌ అయ్యారు. దొంగతనంగా పనులు చేయిస్తోందని, తెలంగాణ ప్రాంతానికి అన్యాయం చేయాలని చూస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని తక్షణమే ఉపసంహరించుకోవాలని డిమాండ్‌ చేశారు మంత్రి జగదీష్‌రెడ్డి.

సమైక్య రాష్ట్రంలోనూ తెలంగాణకు అన్యాయం జరిగిందని అన్నారు మంత్రి జగదీష్‌రెడ్డి. ఆనాడు చంద్రబాబు, వైఎస్ తెలంగాణకు అన్యాయం చేశారని, ఇప్పుడు జగన్‌ తెలంగాణ జలాలను దోపిడీ చేయాలని చూస్తున్నారని మండిపడ్డారు. జలయజ్ఞం పేరుతో తెలంగాణ జలాలను వైఎస్ దోపిడీ చేస్తుంటే అప్పటి కాంగ్రెస్‌ నేతలు వైఎస్‌కు వంతపాడారన్నారు. తెలంగాణ రాష్ట్రం రాకుండా వైఎస్సార్‌ చేయని కుట్రలులేవని విమర్శించారు మంత్రి జగదీష్‌రెడ్డి.


Arun Chilukuri

Arun Chilukuri

Next Story