Jagdish Reddy: కిషన్ రెడ్డిది ప్రజలను మోసం చేసే యాత్ర..

Jagdish Reddy: కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి చెప్పేవన్నీ అబద్ధాలేనని మంత్రి జగదీశ్ రెడ్డి అన్నారు.

Arun Chilukuri
Published on: 20 Aug 2021 8:54 PM IST
Jagdish Reddy: కిషన్ రెడ్డిది ప్రజలను మోసం చేసే యాత్ర..
X

Jagdish Reddy: కిషన్ రెడ్డిది ప్రజలను మోసం చేసే యాత్ర..

Jagdish Reddy: కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి చెప్పేవన్నీ అబద్ధాలేనని మంత్రి జగదీశ్ రెడ్డి అన్నారు. కేంద్రమంత్రి కిషన్ రెడ్డిది ప్రజా ఆశీర్వాద యాత్ర కాదు.. ప్రజలను మోసం చేసే యాత్ర అన్నారు. దేశంలో ఏ రాజకీయ పార్టీలైనా ర్యాలీలు చేసుకోవచ్చని చెప్పిన మంత్రి.. కిషన్ రెడ్డి వాస్తవాలు చెప్పకుండా గాలి మాటలు చెప్తున్నారని ఎద్దేవా చేశారు. 70 రూపాయలు ఉన్న పెట్రోల్ – డీజిల్‌ను వంద దాటించినందుకు ఆశీర్వదించాలని ప్రజలను అడగాలంటూ కిషన్ రెడ్డికి సూచించారు మంత్రి జగదీశ్ రెడ్డి.

కిషన్ రెడ్డి ఎన్నికల ముందు ఇచ్చిన హామీలు ఒక్కటైనా నెరవేర్చలేదని మంత్రి ఈ సందర్భంగా ఎద్దేవా చేశారు. తెలంగాణ నుంచి పన్నుల రూపంలో వేల కోట్లు కేంద్రానికి వెళ్తున్నా రాష్ట్రానికి ఇవ్వాల్సిన నిధులే సక్రమంగా ఇవ్వట్లేదని జగదీశ్ రెడ్డి విమర్శించారు. కిషన్ రెడ్డి గానీ, బీజేపీ ఎంపీలు గానీ రాష్ట్రానికి నిధులేమైనా తెచ్చారా అని ప్రశ్నించారు. బీజేపీ ఎన్నికల మేనిఫెస్టో, టీఆర్ ఎస్ మేనిఫెస్టో ప్రజల ముందు పెట్టి చర్చిద్దామని కిషన్ రెడ్డి కి మంత్రి జగదీశ్ రెడ్డి సవాల్ విసిరారు.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story