Jagadish Reddy: ఎమ్మెల్యే రాజాసింగ్ సస్పెన్షన్ కూడా ఓ డ్రామానే..

Jagadish Reddy: బీజేపీ ఎన్ని కుట్రలు చేసినా తెలంగాణలో కేసీఆర్ ప్రభుత్వానికి ప్రజాదరణను అడ్డుకోలేరన్నారు మంత్రి జగదీష్ రెడ్డి.

Arun Chilukuri
Updated on: 24 Aug 2022 7:21 PM IST
Minister Jagadish Reddy Reaction on Raja Singh Suspension
X

Jagadish Reddy: ఎమ్మెల్యే రాజాసింగ్ సస్పెన్షన్ కూడా ఓ డ్రామానే..

Jagadish Reddy: బీజేపీ ఎన్ని కుట్రలు చేసినా తెలంగాణలో కేసీఆర్ ప్రభుత్వానికి ప్రజాదరణను అడ్డుకోలేరన్నారు మంత్రి జగదీష్ రెడ్డి. స్వార్థ రాజకీయాల కోసం రాష్ట్రంలో విధ్వేషాలు సృష్టించే ప్రయత్నం చేస్తోందన్నారు. రాజాసింగ్ సస్పెన్షన్ కూడా ఓ డ్రామానే అన్నారు. విధ్వేషాలు రెచ్చగొట్టేలా వ్యవహరిస్తున్న బీజేపీ నేతల తీరును ప్రజాస్వామిక వాదులందరూ ఖండించాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. అధికార కాంక్షతో బీజేపీ తన వికృత రూపాన్ని బయట పెడుతోందన్నారు.

పరిపాలన చేయాల్సిన చట్ట సంస్థలన్నీ పక్కనపెట్టి వీళ్లే ప్రత్యేకంగా పనిచేస్తున్నట్టు కనపడుతుందన్నారు. బీజేపీ ఎంపీ ఆరోపణలు చేస్తే టీఆర్ఎస్ నేతల ఇళ్లపై దాడులు చేయడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. తెలంగాణలో శాంతి భద్రతలను దెబ్బతీయాలని ఆలోచిస్తూ బీజేపీ కుట్రలు చేస్తోందని ఆరోపించారు. ఇలాంటి చిల్లర ఎత్తుగడలను ప్రజలు గమనిస్తున్నారని త్వరలో ఆపార్టీ గుణపాఠం తప్పదన్నారు.


Arun Chilukuri

Arun Chilukuri

Next Story