బీజేపీ, కాంగ్రెస్ పై మంత్రి జగదీష్ రెడ్డి ఫైర్

X
Highlights
గ్రేటర్ ఎన్నికల్లో బీజేపీ, కాంగ్రెస్ నేతలు అడ్డగోలుగా మాట్లాడుతున్నారంటూ మంత్రి జగదీష్ రెడ్డి ఫైరయ్యారు....
Arun Chilukuri20 Nov 2020 1:52 PM GMT
గ్రేటర్ ఎన్నికల్లో బీజేపీ, కాంగ్రెస్ నేతలు అడ్డగోలుగా మాట్లాడుతున్నారంటూ మంత్రి జగదీష్ రెడ్డి ఫైరయ్యారు. మాట్లాడితే చర్చలు అంటున్నారని, హైదరాబాద్ నగర అభివృద్ధి మీద చర్చకు మేం సిద్దం మీరొస్తారా అంటూ సవాల్ విసిరారు. నగర అభివృద్ధిపై చర్చించేందుకు గుడికైనా, బడికైనా ఏ గల్లీకైనా వస్తామన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ను ఉగ్రవాది, దేశద్రోహి అన్న వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామన్నారు. జీహెచ్ఎంసీ ఎన్నికల్లో వంద సీట్లకు పైనే గెలిచి సొంతంగా మేయర్ పీఠాన్ని దక్కించుకుంటామని ఆశాభావం వ్యక్తం చేశారు. బండి సంజయ్ లేఖ ఫోర్జరీ అయితే పోలీస్టేషన్ కు వెళ్లాలికాని గుడికి కాదంటూ ఎద్దేవా చేసిన మంత్రి దుబ్బాకలో అప్రమత్తంగా లేకపోవడం వల్లే టీఆర్ఎస్ ఓడిపోయినట్లు వెల్లడించారు.
Web TitleMinister Jagadish reddy fires on congress bjp
Next Story