Jagadish Reddy: కేంద్రం ఉత్త‌ర్వుల‌పై న్యాయ పోరాటం చేస్తాం..

Jagadish Reddy: తెలంగాణ సర్కార్ ఏపీకి విద్యుత్ బకాయిలు చెల్లించాలంటూ కేంద్ర ప్రభుత్వం ఉత్తర్వులు ఇవ్వడాన్ని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి జగదీష్ రెడ్డి ఖండించారు.

Arun Chilukuri
Published on: 30 Aug 2022 5:21 PM IST
Minister Jagadish Reddy Fires On Center Orders Over Power Bill Issues
X

Jagadish Reddy: కేంద్రం ఉత్త‌ర్వుల‌పై న్యాయ పోరాటం చేస్తాం..

Jagadish Reddy: తెలంగాణ సర్కార్ ఏపీకి విద్యుత్ బకాయిలు చెల్లించాలంటూ కేంద్ర ప్రభుత్వం ఉత్తర్వులు ఇవ్వడాన్ని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి జగదీష్ రెడ్డి ఖండించారు. ఈ ఉత్తర్వులు రాజకీయ దురుద్దేశంతో కూడుకున్నవని ఆయన ఎదురుదాడి చేశారు. కేంద్రప్రభుత్వ విద్యుత్ ఉత్తర్వుల పై న్యాయపోరాటం చెపడతామని మంత్రి జగదీష్ స్పష్టం చేశారు. కేంద్రప్రభుత్వ కుట్రలను సీఎం కేసీఆర్ దేశ వ్యాప్తంగా ప్రజల దృష్టికి తీసుకెళ్లి ఎండగడతారని ఆయన తేల్చిచెప్పారు. తెలంగాణకు 12 వేల 941 కోట్లు రావాలని చెబుతున్నా కేంద్రం పట్టించుకోవడం లేదని ఆయన మండిపడ్డారు. తెలంగాణ వాదనలు పెడచెవిన పెట్టిన కేంద్రం ఆంధ్రప్రదేశ్ వాదనలు మాత్రమే విని ఏకపక్ష ఉత్తర్వులు ఇచ్చిందని దుయ్యబట్టారు.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story