బండి సంజయ్‌పై మంత్రి జగదీష్ రెడ్డి ఘాటు విమర్శలు

Jagadish Reddy: ఈడీకి భయపడే ప్రసక్తే లేదు

Sriveni Erugu
Published on: 14 Aug 2022 3:35 PM IST
Minister Jagadish Reddy Fires On Bandi Sanjay
X

బండి సంజయ్‌పై మంత్రి జగదీష్ రెడ్డి ఘాటు విమర్శలు

Jagadish Reddy: బండి సంజయ్‌కి మంత్రి జగదీష్ రెడ్డి ఘాటుగా కౌంటరిచ్చారు. ఈడీకి భయపడే ప్రసక్తే లేదన్నారు. బండి సంజయ్ వ్యాఖ్యలను బట్టి చూస్తే.. ఈడీని జేబు సంస్థగా చెబుతున్నట్లున్నాయని ఆరోపించారు. బండి సంజయ్ ఒక గల్లీ లీడర్ అంటూ ఎద్దేవా చేశారు. మునుగోడు ఉప ఎన్నికల్లో బీజేపీది మూడో స్థానమేనని ఆయన అన్నారు. అక్రమ సంపాదనతో కోట్లు కుమ్మరించి రాజ్ గోపాల్ రెడ్డి గెలవాలనే కుట్ర చేస్తున్నారని విమర్శించారు. మునుగోడు ఉప ఎన్నికతో కోమటిరెడ్డి బ్రదర్స్ చరిత్ర సమాప్తమని మంత్రి జగదీష్ రెడ్డి హాట్ కామెంట్స్ చేశారు .

Sriveni Erugu

Sriveni Erugu

Next Story