Etela Rajender: ఈటల రాజేందర్‌పై మంత్రి జగదీశ్‌రెడ్డి ఘాటు విమర్శలు

Etela Rajender: ఈటల చెప్పే మాటలకు... చేతలకు పొంతన లేదు-జగదీశ్‌‌రెడ్డి

Sandeep Eggoju
Updated on: 14 Jun 2021 6:16 PM IST
Minister Jagadish Reddy Criticisms on Etela Rajender
X

మంత్రి జగదీష్ రెడ్డి (ఫైల్ ఇమేజ్)

Etela Rajender: బీజేపీలో చేరిన ఈటల రాజేందర్‌పై మంత్రి జగదీశ్‌రెడ్డి ఘాటు విమర్శలు చేశారు. ఈటల చెప్పే మాటలకు చేతలకు పొంతన లేదన్నారు. గుంపును వదిలి అడవిలోకి వెళ్లిన ఈటల మృగాల పాలవడం ఖాయమన్నారు. బీజేపీలో చేరిన ఈటలకు ముఖ్యమంత్రి కేసీఆర్‌ను విమర్శించే అర్హత లేదన్నారు. గతంలో బీజేపీని తీవ్రంగా విమర్శించిన ఈటల ఇప్పుడు ఆ పార్టీలో ఎలా చేరారని మంత్రి జగదీశ్‌రెడ్డి ప్రశ్నించారు. మునిగిపోయే పడవ ఎక్కిన ఈటల రాజేందర్‌ తన సహచరులను కూడా ముంచేస్తున్నారని అన్నారు.


Sandeep Eggoju

Sandeep Eggoju

Next Story