Indrakaran Reddy: మా ఇష్టం ఉన్నవారికి మాత్రమే దళితబంధు ఇస్తాం

Indrakaran Reddy: దళిత బంధుతో కార్లు, ట్రాక్టర్లు కొంటే అవి అన్నం పెడతాయా?

Jyothi
Updated on: 27 Sept 2022 11:38 AM IST
Minister Indrakaran Reddy Sensational Comments on Dalit Bandhu
X

Indrakaran Reddy: మా ఇష్టం ఉన్నవారికి మాత్రమే దళితబంధు ఇస్తాం 

Indrakaran Reddy: మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. తమకు ఇష్టం వచ్చిన వాళ్లకు దళిత బంధు ఇస్తాం అంటూ ఇంద్రకరణ్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. దళిత బంధు వచ్చే వరకు ఓపిక లేకుంటే ఏం చేయలేం అంటూ కామెంట్స్ చేశారు. నిర్మల్ జిల్లా నర్సాపూర్ జి వెళ్లిన మంత్రి ఇంద్రకరణ్ రెడ్డిని.. దళిత బంధు పథకంపై మహిళలు నిలదీశారు. దళిత బంధుతో కార్లు, ట్రాక్టర్లు కొంటే అవి అన్నం పెడుతాయా..? 10 లక్షలతో ఏం చేసి బతుకుతారు..? మీకు ఏం అనుభవం ఉంది. చెబితేనే దళిత బంధు ఇస్తామంటూ కీలక వ్యాఖ్యలు చేశారు.

hmtv బతుకమ్మ పాట 2022 కోసం ఇక్కడ క్లిక్ చేయండి



Jyothi

Jyothi

Next Story