మొక్క నాటి కార్యక్రమం ప్రారంభించిన మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి

Indrakaran Reddy: అన్ని పట్టణ ప్రాంతాల్లో అర్బన్ ఫారెస్ట్ పార్కుల ఏర్పాటు

Jyothi
Updated on: 21 Aug 2022 1:02 PM IST
Minister Indrakaran Reddy planted Trees in the Botanical Garden
X

మొక్క నాటి కార్యక్రమం ప్రారంభించిన మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి 

Indrakaran Reddy: స్వతంత్ర భారత వజ్రోత్సవాలను దేశంలోనే ఘనంగా నిర్వహిస్తున్న రాష్ట్రం తెలంగాణ ఒక్కటే అని అటవీ పర్యావరణ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి అన్నారు. రాష్ట్రవ్యాప్తంగా వాళ్ళు ఒక్కరోజే 75 లక్షలు మొక్కలు నాటుతున్నామని చెప్పారు. హరితహారంలో భాగంగా అన్ని పట్టణ ప్రాంతాల్లో అర్బన్ ఫారెస్ట్ పార్కుల ఏర్పాటు జరుగుతుందన్నారు. బొటానికల్ గార్డెన్ దగ్గర విజిటర్స్ కోసం ప్రత్యేకంగా ఫుట్ ఓవర్ బ్రిడ్జి, వాకింగ్ సిగ్నల్ ఏర్పాటు చేస్తామన్నారు. స్వతంత్ర వజ్రోత్సవ వేడుకల్లో భాగంగా ఇవాళ రాష్ట్రవ్యాప్తంగా ప్రత్యేక తెలంగాణకు హరితహారం కార్యక్రమం నిర్వహిస్తున్నారు. హైదరాబాద్ కొత్తగూడ బొటానికల్ గార్డెన్ లో మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి మొక్క నాటి కార్యక్రమాన్ని ప్రారంభించారు.


Jyothi

Jyothi

Next Story