Indrakaran Reddy: అవినీతి నిరూపిస్తే రాజకీయాల నుంచి తప్పుకుంటా..

Indrakaran Reddy: అవినీతి నిరూపిస్తే రాజకీయాల నుంచి తప్పుకుంటా..

Arun Chilukuri
Updated on: 5 Dec 2022 6:31 PM IST
Minister Indrakaran Reddy Open Challenge to Bandi Sanjay
X

Indrakaran Reddy: అవినీతి నిరూపిస్తే రాజకీయాల నుంచి తప్పుకుంటా..

Indrakaran Reddy: నిర్మల్ జిల్లాలో పాదయాత్ర సందర్భంగా బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ చేసిన కామెంట్లపై మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి కౌంటర్ అటాక్‌కు దిగారు. శివాజీ చౌక్‌లో జరిగిన రోడ్ షోలో తనపై నిరాధారమైన ఆరోపణలు, అసత్యాలు చెప్పారని ఆయన ఫైర్ అయ్యారు. నిర్మల్‌లోని మున్సిపల్‌లో నాలుగవ తరగతి ఉద్యోగుల నియామకంలో అవినీతి నిరూపిస్తే.. తాను రాజకీయాల నుంచి తప్పుకుంటానని..లేకపోతే బండి సంజయ్ రాజకీయాల నుంచి తప్పుకుంటారా అని సవాల్ విసిరారు. సీఎం కేసీఆర్ గురించి ఎమ్మెల్సీ కవిత గురించి అవాకులు,చెవాకులు మాట్లాడొద్దని హెచ్చరించారు. అలాగే పాదయాత్రలో అసభ్యకరమైన పదాలు వాడడం మంచి పద్ధతి కాదని ఆగ్రహం వ్యక్తం చేశారు.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story