రేషన్‌ వార్‌పై నిర్మలా సీతారామన్‌కు కౌంటర్ ఇచ్చిన మంత్రి హరీష్‌రావు

Harish Rao: దేశాన్ని సాదుతున్న రాష్ట్రాల్లో తెలంగాణ ఒకటన్న మంత్రి హరీష్‌రావు..

Jyothi
Published on: 3 Sept 2022 7:11 AM IST
Minister Harish Rao Strong Counter to FM Nirmala Sitharaman over Ration
X

రేషన్‌ వార్‌పై నిర్మలా సీతారామన్‌కు కౌంటర్ ఇచ్చిన మంత్రి హరీష్‌రావు

Harish Rao: రేషన్‌ వార్‌పై కేంద్ర ఆర్థికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్‌కు కౌంటర్ ఇచ్చారు తెలంగాణ మంత్రి హరీష్‌రావు. దేశాన్ని సాదుతున్న రాష్ట్రాల్లో తెలంగాణ ఒకటన్న మంత్రి హరీష్‌రావు..కేంద్రం తెలంగాణకు ఇచ్చిన నిధుల కంటే..రాష్ట్రమే కేంద్రానికి ఇచ్చిన నిధుల వాటా అత్యధికమన్నారు. అలాంటప్పుడు సీఎం కేసీఆర్ ఫోటోను కేంద్రం పెడుతుందా అని ప్రశ్నించారు. ప్రత్యేక తెలంగాణ ఏర్పడినప్పటి నుంచి ఇప్పటివరకు 3లక్షల కోట్లకుపైగా నిధులను కేంద్రానికి ఇచ్చిన ఘనత తమ ప్రభుత్వానిదే అన్నారు మంత్రి హరీష్‌రావు. అందుకే సీఎం కేసీఆర్ ఫోటోను కేంద్రమే పెట్టుకోవాలని సూచించారు. నిర్మలా సీతారామన్ చేస్తున్న వ్యాఖ్యల్లో ఎలాంటి వాస్తవంలేదని మంత్రి హరీష్‌రావు కొట్టిపారేశారు.

Jyothi

Jyothi

Next Story