దొడ్డి దారిన సీఎం అయ్యావు.. మధ్యప్రదేశ్ సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్‌కు హరీశ్ కౌంటర్..

Harish Rao: సీఎం కేసీఆర్‌పై మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ చేసిన విమర్శలకు మంత్రి హరీశ్ రావు కౌంటర్ ఇచ్చారు.

Arun Chilukuri
Published on: 8 Jan 2022 3:08 PM IST
Minister Harish Rao Slams MP CM Shivraj Singh Chouhan
X

దొడ్డి దారిన సీఎం అయ్యావు.. మధ్యప్రదేశ్ సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్‌కు హరీశ్ కౌంటర్..

Harish Rao: సీఎం కేసీఆర్‌పై మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ చేసిన విమర్శలకు మంత్రి హరీశ్ రావు కౌంటర్ ఇచ్చారు. శివరాజ్ సింగ్ అవాకులు, చెవాకులు మాట్లాడారని ఫైర్ అయ్యారు. వంద ఎలుకలను తిన్న పిల్లి తాను శాఖాహారి అన్నట్లు ఆయన వ్యవహారం ఉందని ఎద్దేవా చేశారు.

దొడ్డి దారిన కాంగ్రెస్ ఎమ్మెల్యేలను కొనుక్కుని సీఎం అయిన చరిత్ర శివరాజ్‌సింగ్ చౌహాన్‌ది అన్నారు. గత నాలుగేళ్లుగా సీఎంగా ఉండి మీ రాష్ట్రానికి చేసిందేమని ప్రశ్నించారు. మధ్యప్రదేశ్ లో జరిగిన వ్యాపం కుంభకోణంలో ఇప్పటి వరకు ఎవరికైనా శిక్ష పడిందా అని ప్రశ్నించారు మంత్రి హరీశ్ రావు.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story