బారానా పెంచి చారానా తగ్గించారు.. కేంద్రంపై మంత్రి హరీష్ రావు ఫైర్..

Minister Harish Rao Slams Central Government Over Petrol Diesel Prices
x

బారానా పెంచి చారానా తగ్గించారు.. కేంద్రంపై మంత్రి హరీష్ రావు ఫైర్..

Highlights

Harish Rao: కేంద్రం తాజాగా పెట్రో ధరలు తగ్గిస్తూ నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే.

Harish Rao: కేంద్రం తాజాగా పెట్రో ధరలు తగ్గిస్తూ నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. పెట్రోల్ ధరల తగ్గింపుపై తెలంగాణ మంత్రి హరీష్ రావు కౌంటర్లు వేశారు. పెట్రోల్ పై పెంచింది బారానా.. తగ్గించింది చారాణా అని ఎద్దేవా చేశారు. మార్చి 2014లో ఉన్న ధరను తెచ్చి మాట్లాడండి అంటూ బీజేపీ నేతలకు సూచించారు. పెట్రోల్, డీజిల్‌పై తెలంగాణ ప్రభుత్వం ఎలాంటి పన్నులు విధించలేదని హరీశ్ రావు పేర్కొన్నారు. చమురుపై సెస్‌ తగ్గించామని కేంద్రం చేస్తున్న ప్రచారమంతా బోగస్‌ అని ఆయన మండిపడ్డారు. రాష్ట్ర ప్రభుత్వం సెస్‌ తగ్గించాలంటూ బీజేపీ నేతలు చేస్తున్న డిమాండ్లపై హరీశ్‌ స్పందించారు. 2014 నుంచి రాష్ట్ర ప్రభుత్వం సెస్‌ పెంచితే కదా తగ్గించడానికి అని ఆయన వ్యాఖ్యానించారు.

Show Full Article
Print Article
Next Story
More Stories