Harish Rao: వంద శాతం రైతుల భూ సమస్యలు పరిష్కరిస్తాం

Harish Rao: ములుగులో ధరణి పోర్టల్‌పై మంత్రి హరీశ్ సమీక్ష

Rama Rao
Published on: 14 Jun 2022 3:16 PM IST
Minister Harish Rao reviews Dharani portal in Mulugu
X

Harish Rao: ములుగులో ధరణి పోర్టల్‌పై మంత్రి హరీశ్ సమీక్ష

Harish Rao: వంద శాతం రైతుల భూ సమస్యలు పరిష్కరిస్తామని మంత్రి హరీష్ రావు అన్నారు. ధరణి పోర్టల్ సమస్యలు, పరిష్కారం తదితర అంశాలపై సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు ములుగులోని ఫారెస్ట్ కళాశాలలో సీఎస్ సోమేశ్ కుమార్, సంబంధిత అధికారులతో మంత్రి సమీక్షించారు. ములుగు మండలాన్ని పైలెట్ ప్రాజెక్ట్‌గా తీసుకున్నామని మంత్రి హరీష్ రావు తెలిపారు. కోర్టు కేసులు, కుటుంబ తగాదాలతో కొన్ని భూ సమస్యలు పెండింగ్‌లో ఉన్నాయన్నారు. త్వరలో సమస్యలు పరిష్కరించి ములుగులో రైతులకు సర్టిఫికెట్లు అందజేస్తామన్నారు.

Rama Rao

Rama Rao

Next Story