Harish Rao: వైద్యారోగ్య శాఖపై మంత్రి హరీశ్‌రావు సమీక్ష

Harish Rao: పదిరోజుల్లో నిమ్స్ కొత్త భవన టెండర్లు పూర్తి చేయాలి

Dhatripriya
Published on: 4 May 2023 4:02 PM IST
Minister Harish Rao Review On Health Department
X

Harish Rao: వైద్యారోగ్య శాఖపై మంత్రి హరీశ్‌రావు సమీక్ష

Harish Rao: వరంగల్‌ హెల్త్‌ సిటీ, నిమ్స్ ఆస్పత్రుల నిర్మాణ పనులు వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించారు మంత్రి హరీశ్‌రావు. వైద్యారోగ్య శాఖపై సమీక్ష జరిపిన మంత్రి.. ఇక నుంచి నెలవారీగా పనుల పురోగతిపై సమీక్ష చేస్తానని తెలిపారు. పది రోజుల్లో నిమ్స్ కొత్త భవన నిర్మాణానికి టెండర్లు పూర్తి చేయాలని ఆదేశించారు. బస్తీ దవాఖానాలు ప్రజల సుస్తీలు పోగొట్టేలా పనిచేయాలని సూచించారు. నెలాఖరు వరకు పల్లె దవాఖానాలు పూర్తి స్థాయిలో పని చేయాలన్న మంత్రి.. పని వేళలు, వైద్యుడి ఫోన్ నెంబర్లను బోర్డులపై ప్రదర్శించాలని తెలిపారు. ఇక కంటి వెలుగు పరీక్షలు అందరికీ పూర్తిచేయాలని... అద్దాల పంపిణీని వేగవంతం చేయాలని మంత్రి హరీశ్‌రావు అధికారులను ఆదేశించారు.

Dhatripriya

Dhatripriya

Next Story