సరదాగా కాసేపు క్రికెట్ ఆడిన మంత్రి హరీష్‌రావు

Arun Chilukuri
Published on: 16 Nov 2020 11:25 AM IST
సరదాగా కాసేపు క్రికెట్ ఆడిన మంత్రి హరీష్‌రావు
X

ప్రభుత్వ కార్యక్రమాలు, రాజకీయాలతో బిజీగా ఉండే మంత్రి హరీష్ రావు సరదాగా బ్యాట్ పట్టారు. అంతేకాదు బౌలింగ్ కూడా వేశారు. ఆల్‌రౌండర్‌నంటూ సరదాగా కాసేపు క్రికెట్ ఆడారు. సిద్దిపేట స్టేడియంలో మెదక్ ఎస్పీ పోలీస్ వర్సెస్ సిద్ధిపేట పోలీసు కమిషనరేట్ మధ్య ఇరవై ఓవర్ల క్రికెట్ మ్యాచ్ జరిగింది. ఈ డే అండ్ నైట్ క్రికెట్ మ్యాచ్‌ను మంత్రి హరీష్‌రావు ప్రారంభించారు. ఇరు జట్ల మధ్య జరుగుతున్న ఈ మ్యాచ్‌కు ముఖ్య అతిథిగా హరీష్‌రావు హాజరయ్యారు. టాస్ వేసిన అనంతరం కాసేపు క్రికెట్ ఆటలో భాగంగా ఒక ఓవర్ బ్యాటింగ్ చేసి, మరో ఓవర్ బౌలింగ్ చేశారు. సిద్ధిపేట పోలీసు కమిషనర్ జోయల్ డేవిస్ బౌలింగ్ చేయగా మంత్రి హరీశ్ రావు బ్యాటింగ్ చేశారు.


Arun Chilukuri

Arun Chilukuri

Next Story