Harish Rao: ఈనెలఖారుకు 100 శాతం వ్యాక్సినేషన్ పూర్తి కావాలి

Harish Rao: జిల్లా కలెక్టర్లు, వైద్యాధికారులను ఆదేశించిన మంత్రి హరీశ్‌రావు

Sandeep Eggoju
Published on: 2 Dec 2021 7:26 AM IST
Minister Harish Rao Orders to Complete the 100 Percent Vaccination Until the 31 December
X

కరోనా వాక్సిన్ (ఫైల్ ఇమేజ్)

Harish Rao: ఈ నెల 31వ తేదీ వ‌ర‌కు వంద శాతం వ్యాక్సినేష‌న్‌ను పూర్తి చేయాల‌ని జిల్లా కలెక్టర్లను, వైద్యాధికారుల‌ను రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి హ‌రీశ్‌రావు ఆదేశించారు. కొవిడ్ ప‌రిస్థితుల‌పై మంత్రి హ‌రీశ్‌రావు నేతృత్వంలో మంత్రివ‌ర్గ ఉపసంఘం భేటీ అయింది. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా నిర్వహించిన ఈ స‌మావేశంలో క‌లెక్టర్లు, వైద్యాధికారులు, విద్యా శాఖ అధికారులు కూడా పాల్గొన్నారు. కొవిడ్ ప‌రిస్థితులు, ఒమిక్రాన్ వేరియంట్‌తో పాటు వ్యాక్సినేష‌న్ ప్రక్రియపై చ‌ర్చించారు. ప్రపంచ వ్యాప్తంగా కొత్త వేరియంట్ ఒమిక్రాన్‌ వచ్చినందున మూడవ దశను సమర్థ వంతంగా ఎదుర్కొనేలా సిద్ధంగా ఉండాలన్నారు.

Sandeep Eggoju

Sandeep Eggoju

Next Story