కేంద్రమంత్రి కిషన్‌రెడ్డికి మంత్రి హరీష్‌ రావు సవాల్‌.. నిరూపిస్తే రాజీనామా..

Harish Rao: కేంద్రమంత్రి కిషన్‌రెడ్డికి మంత్రి హరీష్‌ రావు సవాల్‌ విసిరారు.

Arun Chilukuri
Updated on: 22 Oct 2021 7:31 PM IST
Minister Harish Rao Open Challenge To Union Minister Kishan Reddy
X

కేంద్రమంత్రి కిషన్‌రెడ్డికి మంత్రి హరీష్‌ రావు సవాల్‌.. నిరూపిస్తే రాజీనామా..

Harish Rao: కేంద్రమంత్రి కిషన్‌రెడ్డికి మంత్రి హరీష్‌ రావు సవాల్‌ విసిరారు. గ్యాస్‌ సిలిండర్‌పై రాష్ట్ర పన్ను 291 రూపాయలు ఉందని నిరూపిస్తే మంత్రి పదవికి రాజీనామా చేస్తానని నిరూపించకపోతే ముక్కు నేలకు రాస్తారా అంటూ కిషన్‌ రెడ్డికి సవాల్‌ విసిరారు హరీష్‌ రావు. అంబేద్కర్‌ చౌరస్తా దగ్గరకు బీజేపీ వాళ్లను రమ్మని, అక్కడ కూర్చుని వాస్తవాలు మాట్లాడుకుందాం అని ఛాలెంజ్‌ చేశారు.

2014లో బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పుడు పెట్రోల్‌పై విధించిన పన్ను రూ.10.43 మాత్రమే అని, ప్రస్తుతం ఆ పన్నులు రూ.32.90 పైసలుగా ఉన్నాయని హరీష్ పేర్కొన్నారు. ఈ ఏడేళ్లలో లీటరు పెట్రోల్‌పై బీజేపీ సర్కారు రూ.22.47 పన్ను పెంచిందన్నారు. అటు లీటరు డీజిల్‌పైనా రూ.27.28 రూపంలో పన్నులు పెంచిందని తెలిపారు.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story