Harish Rao: నేడు వైద్యశాఖ అధికారులతో మంత్రి హరీష్‌రావు సమావేశం

* ప్రపంచవ్యాప్తంగా కొత్త వేరియంట్ తీరు, తీసుకుంటున్న చర్యలపై చర్చ * విదేశాల నుంచి వచ్చేవారి విషయంలో తీసుకోవాల్సిన చర్యలపై సమీక్ష

Shilpa
Published on: 28 Nov 2021 9:46 AM IST
Minister Harish Rao Meeting with Health Department Officials Today 28 11 2021
X

నేడు వైద్యశాఖ అధికారులతో మంత్రి హరీష్‌రావు సమావేశం(ఫైల్ ఫోటో)

Harish Rao: దక్షిణాఫ్రికాలో వెలుగుచూసిన కరోనా కొత్త వేరియంటర్‌పై తెలంగాణ ప్రభుత్వం అప్రమత్తమైంది. ఇవాళ వైద్య, ఆరోగ్య శాఖ అధికారులతో మంత్రి హరీశ్ రావు భేటీకానున్నారు. కొత్త వేరియంట్ వ్యాపిస్తున్న దేశాల నుంచి వచ్చే వారి విషయంలో తీసుకోవాల్సిన చర్యలపై సమీక్షించనున్నారు.

ఇదే విషయంలో రాష్ట్రాలను అప్రమత్తం చేసింది కేంద్ర ప్రభుత్వం. ఆయా దేశాల నుంచి నేరుగా హైదరాబాద్‌కు విమానాలు లేని కారణంగా ముంబై , ఢిల్లీలలో దిగి హైదరాబాద్‌కు వచ్చే వారిని ట్రేసింగ్, టెస్టింగ్ ఎలా చేయాలన్న దానిపై అధికారులతో చర్చించనున్నారు హరీశ్ రావు.

Shilpa

Shilpa

Next Story