Harish Rao: సీఎం నిర్ణయాలతో విపక్షాలకు దిక్కుతోచడం లేదు

Harish Rao: విపక్షాలపై మంత్రి హరీష్‌రావు హాట్‌ కామెంట్స్‌

Jyothi
Published on: 3 Aug 2023 12:20 PM IST
Minister Harish Rao Hot Comments on the Opposition
X

Harish Rao: సీఎం నిర్ణయాలతో విపక్షాలకు దిక్కుతోచడం లేదు

Harish Rao: అసెంబ్లీ లాబీలో మీడియాతో చిట్‌చాట్‌ చేసిన మంత్రి హరీష్‌ రావు విపక్షాలపై ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఆర్టీసీ విలీనం, రైతు రుణమాఫీ, పోడు భూములకు పట్టాలు, వీఆర్‌ఏల సర్దుబాటుతో ప్రతిపక్షాలకు మాస్టర్‌ స్ట్రోక్‌ ఇచ్చామన్నారు. ప్రభుత్వం వైపు నుంచి దెబ్బమీద దెబ్బ తగలడంతో విపక్షాలు తట్టుకోలేక పోతున్నాయన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్‌ తీసుకుంటున్న కీలక నిర్ణయాలతో ప్రతిపక్షాలకు ఏం మాట్లాడాలో తెలియకుండా పోతోందన్నారు. వరుస నిర్ణయాలతో ప్రతిపక్షాలకు వాయిస్‌ లేకుండా పోయిందని.. బయటే కాదు అసెంబ్లీ లోపల కూడా ప్రతిపక్షాలను కడిగి పారేస్తమన్నారు మంత్రి హరీష్‌ రావు.

Jyothi

Jyothi

Next Story