రాజాసింగ్ జీ జ‌ర సునో.. హరీష్ రావు చురకలు..

Minister Harish Rao Fun With Bjp Mla Raja Singh
x

రాజాసింగ్ జీ జ‌ర సునో.. హరీష్ రావు చురకలు..

Highlights

Harish Rao: మంత్రి హరీష్ రావు ఎమ్మెల్యే రాజాసింగ్ మధ్య ఆసక్తికర చర్చ జరిగింది.

Harish Rao: మంత్రి హరీష్ రావు ఎమ్మెల్యే రాజాసింగ్ మధ్య ఆసక్తికర చర్చ జరిగింది. హైదరాబాద్ లోని కోఠి ఈఎన్టీ హాస్పిటల్‎ ను హోంమంత్రి మహమూద్‎ అలీ, రాజాసింగ్‎తో కలిసి సందర్శించారు. ఈ సందర్భంగా మంత్రి‎ హరీష్ ‎రావు ఎమ్మెల్యే రాజాసింగ్‎తో కలిసి అక్కడి వైద్యసేవలను పరిశీలించారు. అనంతరం అక్కడున్న కొంతమంది పేషంట్లతో మాట్లాడి అందుతున్న వైద్య సేవలపై మంత్రి హరీష్ ఆరా తీశారు.

ఈ సందర్భంగా ఓ పేషంట్ ఇక్కడ వైద్యసేవలు అద్బుతంగా ఉన్నాయంటూ చెప్పడంతో ఆపక్కనే ఉన్న రాజాసింగ్ ను చూసిన మంత్రి రాజాసింగ్ జీ జర సునో అంటూ చమత్కరించాడు. అక్కడున్న పరిస్థితులపై ప్రత్యక్షంగా పేషంట్లే అద్బుతమని చెబుతుంటే చేసేదేమీ లేక రాజాసింగ్ అవునన్నట్లు సంతృప్తిపరచడం ఆసక్తిగా మారింది.


Show Full Article
Print Article
Next Story
More Stories