కాంగ్రెస్ పార్టీకి క్యాండిడేట్ లేడు, బీజేపీకి కార్యకర్తలు లేరు : మంత్రి హరీశ్ రావు

కాంగ్రెస్ పార్టీకి క్యాండిడేట్ లేడు, బీజేపీకి కార్యకర్తలు లేరు : మంత్రి హరీశ్ రావు
x
Highlights

నిత్యం ప్రజలకు మెరుగైన వైద్య సదుపాయాలు అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తున్నదని ఆర్థిక శాఖ మంత్రి హరీశ్ రావు అన్నారు. జిల్లాలోని మిరుదొడ్డి...

నిత్యం ప్రజలకు మెరుగైన వైద్య సదుపాయాలు అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తున్నదని ఆర్థిక శాఖ మంత్రి హరీశ్ రావు అన్నారు. జిల్లాలోని మిరుదొడ్డి మండలం అక్బర్ పేట గ్రామంలో నూతనంగా నిర్మించిన గెస్ట్ హౌస్- అతిథి గృహంతో పాటు, నూతన అంబులెన్స్ ను శుక్రవారం మంత్రి ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి హరీశ్ మాట్లాడుతూ..దుబ్బాక నియోజకవర్గంలో ప్రజలకు అందుబాటులో ఉండేలా మరో రెండు నూతన అంబులెన్సులను మండలంలోని భూంపల్లి గ్రామంలో ప్రారంభించుకున్నామని తెలిపారు.

ఆయన ఇంకేమన్నారంటే.. దుబ్బాకలో ఏవరు గెలుస్తారని.. యువకుల నుంచి పండు ముసలిని అడిగినా.. కేసీఆర్ సారూ టీఆర్ఎస్ కారు గెలుపే. దుబ్బాక ఉప ఎన్నికల్లో పోటీ ఎవరూ రెండవ స్థానంలో నిలిచేదనే పోటీ కాంగ్రెస్, బీజేపీలో ఉన్నాయి. కాంగ్రెస్, బీజేపీలకు డిపాజిట్లు వస్తాయా.. అనేది తెలుసుకోవడం కోసమే.. ఈ దుబ్బాక ఉప ఎన్నికలు. టీఆర్ఎస్ పార్టీకి ఓటు వేసేందుకు దుబ్బాక ప్రజలు ఉత్సాహంగా, సంతోషంగా ఉన్నారని., మిషన్ భగీరథతో మంచినీళ్ల బాధలు టీఆర్ఎస్ ప్రభుత్వంతో తొలగిపోయాయనే సంతోషంలో ఉన్నారు. స్వాతంత్ర్యం వచ్చిన నాటి నుంచి 70 ఏళ్లు కాంగ్రెస్, బీజేపీ, టీడీపీలు నీళ్లు తాగించలేదని, కేవలం 6 ఏండ్లలో తాగునీరు, అతి త్వరలో సాగునీరు అందించనున్నాం. కాళేశ్వరం ప్రాజెక్టులో అధిక సాగునీరు దుబ్బాక నియోజకవర్గంలో వస్తుందని, లక్షా 25 వేల ఎకరాలకు సాగునీరు అందనుందని, పంట కాల్వలు, పిల్ల కాల్వలు తవ్వుకుంటే రెండు పంటలు వేసుకోవచ్చు. దేశంలోని 28 రాష్ట్రాల్లో బావి, బోరు బావులకు 24 గంటల ఉచిత విద్యుత్ ఇచ్చిన దమ్ము ఉన్న నాయకుడు కేసీఆర్. బోరు బావులకు విద్యుత్ మీటర్ల బిగింపు వ్యతిరేకిస్తూ టీఆర్ఎస్ పార్టీకి ఓటు వేసి బీజేపీ డిపాజిట్ గల్లంతు చేయాలి. అర్హత కలిగిన వారందరికీ పింఛన్లు ఇప్పించే బాధ్యత నాదే. దేశంలోని 18 రాష్టాల్లో బీజేపీ అధికారంలో ఉన్నదని ఏ రాష్ట్రంలోనైనా బీడీ కార్మికులకు పింఛన్లు అందిస్తుందా అంటూ సూటిగా ప్రశ్నించారు.

దుబ్బాక నియోజకవర్గ పరిధిలో 56 వేల 906 పింఛన్లు ఉన్నాయని, ఇటీవల 5877 కొత్త పింఛన్లు మంజూరైనట్లు.., దుబ్బాకలో చదివిన కేసీఆర్ సారూకు బీడీ కార్మికుల బాధలు తెలుసునని దుబ్బాక పై ప్రేమ, మమకారంతో దుబ్బాక మున్సిపాలిటీ అభివృద్ధికి 35 కోట్లు అభివృద్ధి చేపడుతున్నాం. ప్రజల సంక్షేమం కోసం పనిచేసే టీఆర్ఎస్ పార్టీని గెలిపించి అభివృద్ధి చేయించుకోవాలని పార్టీ కార్యకర్తలు ప్రజలకు చెప్పాలని పిలుపునిచ్చారు. ఐదేళ్లకు ఒకసారి ఎన్నికల కోసం వచ్చేటోళ్లకు తేడా ఉంటుందని ప్రజల మధ్యన ఉంటూ ప్రజా సంక్షేమం, అభివృద్ధి జరిగేలా చూసే టీఆర్ఎస్ పార్టీకి లక్ష మెజారిటీ ఇవ్వండని, కేసీఆర్ కు దండం పెట్టి దుబ్బాకను అభివృద్ధి పథంలో నడిపించే బాధ్యత నేను తీసుకుంటాను అని తెలిపారు.


Show Full Article
Print Article
Next Story
More Stories