బీజేపీపై మంత్రి హరీశ్‌రావు ఫైర్‌..

బీజేపీపై మంత్రి హరీశ్‌రావు ఫైర్‌..
x
Highlights

బీజేపీపై విమర్శలు గుప్పించారు తెలంగాణ మంత్రి హరీశ్ రావు. మంత్రి హరీశ్ రావు ఇవాళ సిద్ధిపేట జిల్లా రాయపోల్ మండల కేంద్రంలో రైతులకు పట్టాదారు పాసు...

బీజేపీపై విమర్శలు గుప్పించారు తెలంగాణ మంత్రి హరీశ్ రావు. మంత్రి హరీశ్ రావు ఇవాళ సిద్ధిపేట జిల్లా రాయపోల్ మండల కేంద్రంలో రైతులకు పట్టాదారు పాసు పుస్తకాలు, వర్షాలకు కూలిన ఇళ్లకు నష్టపరిహారం చెక్కులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. టీఆర్ఎస్ ప్రభుత్వం రాకముందు రైతుబంధు పథకం లేదన్నారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం రైతుల గుండెల్లో రెండు బాంబులు వేసిందని పేర్కొన్నారు. 70 లక్షల మెట్రిక్ టన్నుల విదేశీ మక్కలు కొనుగోలు కోసం అగ్రిమెంట్ చేశారని, ఎవరి ప్రయోజనం కోసం చేశారో సమాధానం చెప్పాలని బీజేపీ పార్టీని ప్రశ్నించారు.

అలాగే బాయికాడ, బోర్లకాడ మీటర్లు పెట్టి కరెంట్ బిల్లులు వసూళ్లు చేయాలని రైతులకు అన్యాయం జరిగేలా చర్యలు చేపట్టిందని విమర్శించారు. వ్యవసాయ మార్కెట్లను రద్దు చేసి కార్పొరేటీకరణకు తెరలేపి నయా జమీందారు వ్యవస్థను తెస్తోందని పేర్కొన్నారు. కరోనా కష్టకాలంలో కూడా సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నామని, రైతుల కోసమే సీఎం కేసీఆర్ కొత్త రెవెన్యూ చట్టం తెచ్చారని ఆయన అన్నారు. కార్యక్రమంలో ఎఫ్డీసీ చైర్మన్ వంటేరు ప్రతాప్ రెడ్డి, అడిషనల్ కలెక్టర్ పద్మాకర్, ఆర్డీఓ విజయేందర్ రెడ్డి, ఇతర ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories