Telangana News: కన్నుల పండువగా.. ఇంటింటికి జాతీయ జెండాల పంపిణీ

Telangana News: స్వాతంత్ర్వ వజ్రోత్సవ వేడుకల్లో భాగంగా సిద్దిపేట జిల్లా గజ్వేల్ లో రాష్ర్ట వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హరీష్ రావు ఇంటింటికి జాతీయ జెండాలు పంపిణీ చేశారు.

Arun Chilukuri
Published on: 9 Aug 2022 3:43 PM IST
Telangana News: కన్నుల పండువగా.. ఇంటింటికి జాతీయ జెండాల పంపిణీ
X

Telangana News: స్వాతంత్ర్వ వజ్రోత్సవ వేడుకల్లో భాగంగా సిద్దిపేట జిల్లా గజ్వేల్ లో రాష్ర్ట వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హరీష్ రావు ఇంటింటికి జాతీయ జెండాలు పంపిణీ చేశారు. గజ్వేల్ పట్టణంలో జాతీయ నాయకుల విగ్రహాలకు మంత్రి హరీష్ రావు పూలమాలలు వేసి నివాళులర్పించారు. దేశంలోనే ఎక్కడ లేని విధంగా రాష్ర్టంలో వజ్రోత్సవ వేడుకలు జరపాలని సీఎం కేసీఆర్ నిర్ణయించారని చెప్పారు.

రాష్ర్ట వ్యాప్తంగా చేనేత కార్మికులు నేసిన కోటి 20 లక్షల జాతీయ జెండాలను పంపిణీ చేస్తున్నట్లు చెప్పారు. ఆగస్ట్ 15న ప్రతి ఒక్కరు తమ ఇళ్లపై జాతీయ జెండా ఎగురవేయాలని పిలుపునిచ్చారు. వజ్రోత్సవ వేడుకల్లో భాగంగా హరిత హారం, వనమహోత్సవ కార్యక్రమాలు జరుపాలని సూచించారు. 75 ఏళ్ల స్వాతంత్ర్యం ప్రాముఖ్యతను చాటి చెప్పే విధంగా వజ్రోత్సవ కార్చక్రమం చేపడుతున్నట్లు హరీష్ రావు చెప్పారు.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story