తేలుకుట్టిన దొంగల్లా బీజేపీ నేతలు వ్యవహరిస్తున్నారు : మంత్రి హరీష్ రావు

తేలుకుట్టిన దొంగల్లా బీజేపీ నేతలు వ్యవహరిస్తున్నారు : మంత్రి హరీష్ రావు
x
Highlights

దుబ్బాక ఉపఎన్నిక ప్రచారంలో రోజురోజుకూ హీట్ పెరుగుతోంది. బీజేపీపై మంత్రి హరీష్ రావు తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. తేలుకుట్టిన దొంగల్లా బీజేపీ నేతలు వ్యవహరిస్తున్నారని హరీష్ మండిపడ్డారు.

దుబ్బాక ఉపఎన్నిక ప్రచారంలో రోజురోజుకూ హీట్ పెరుగుతోంది. బీజేపీపై మంత్రి హరీష్ రావు తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. తేలుకుట్టిన దొంగల్లా బీజేపీ నేతలు వ్యవహరిస్తున్నారని హరీష్ మండిపడ్డారు. కాంగ్రెస్, బీజేపీ పార్టీలతో ప్రజలకు ఒరిగేదేమీ లేదని విమర్శించారు. సిద్దిపేట జిల్లా మిరుదొడ్డి మండల కేంద్రంలో వివిధ పార్టీలకు చెందిన నాయకులు మంత్రి హరీష్ ఆధ్వర్యంలో టీఆర్ఎస్ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. బీహార్ ఎన్నికల ప్రచారంలో బీజేపీ అభ్యర్థి గెలుపు కోసం కరోనా మందును ఉచితంగా పంపిణీ చేస్తామనడం సిగ్గుచేటని దుయ్యబట్టారు.

ఇక ఇది ఇలా ఉంటే టీఆర్ఎస్ నేత సోలిపేట రామలింగారెడ్డి అనారోగ్య సమస్యలతో ఆగస్టు నెలలో మరణించడంతో అక్కడ ఉపఎన్నికలు అనివార్యం అయ్యాయి.. ఈ క్రమంలో నవంబరు 3న పోలింగ్‌ నిర్వహించనున్నారు. ఇప్పటికే ఆయా పార్టీలు అభ్యర్ధులను కూడా ప్రకటించాయి.. టీఆర్‌ఎస్‌ అభ్యర్థిగా రామలింగారెడ్డి సతీమణి సోలిపేట సుజాత, కాంగ్రెస్‌ అభ్యర్థిగా చెరుకు శ్రీనివాస్‌రెడ్డి, బీజేపీ అభ్యర్థిగా రఘునందన్‌రావు పోటిలో ఉన్నారు. ఇక నవంబర్ 3 న ఎన్నికలు జరగగా 10 న ఫలితాలు రానున్నాయి.

Show Full Article
Print Article
Next Story
More Stories