Harish Rao: నాంపల్లి ఎగ్జిబిషన్ సొసైటీ అధ్యక్షుడిగా మంత్రి హరీష్ రావు

* హరీష్ రావును కలిసి ధన్యవాదాలు తెలిపిన ఎగ్జిబిషన్ సొసైటీ సభ్యులు

Sandeep Reddy
Updated on: 21 Aug 2021 4:00 PM IST
Minister Harish Rao as the President of the Exhibition Society
X

హరీష్ రావు(ఫైల్ ఫోటో)

Harish Rao: హైదరాబాద్ నాంపల్లి ఎగ్జిబిషన్‌ సొసైటీ అధ్యక్షుడిగా మంత్రి హరీశ్‌ రావు ఎన్నికయ్యారు. ఎగ్జిబిషన్ కమిటీ సభ్యులు మంత్రి హరీష్ రావును కలిసి ధన్యవాదాలు తెలిపారు. ఎగ్జిబిషన్ సొసైటీని ప్రగతి పథంలో నడిపిచేందుకు కృషి చేస్తానని హరీష్ రావు చెప్పారు. గత 80 ఏళ్లుగా ఆల్‌ ఇండియా ఇండస్ట్రియల్‌ ఎగ్జిబిషన్‌ను ఘనంగా నిర్వహిస్తున్నదని తెలిపారు. సీఎం కేసీఆర్‌ సహకారంతో నుమాయిష్‌ను విశ్వవ్యాప్తం చేద్దామన్నారు. సొసైటీ విద్యాసంస్థల ద్వారా పేద విద్యార్థులకు నాణ్యమైన విద్య అందుతున్నదని వెల్లడించారు. వృత్తి నైపుణ్యం మెరుగుపడి ఉపాధి అవకాశాలు పొందేలా వారిని తీర్చిదిద్దుదామని చెప్పారు.

Sandeep Reddy

Sandeep Reddy

Next Story