Gangula Kamalakar: రాష్ట్రంలో పెట్రోల్, డీజిల్ కొరత లేదు.. ఆ పుకార్లను నమ్మొద్దు..
Gangula Kamalakar: తెలంగాణలో పెట్రోల్, డీజిల్ కొరత లేనేలేదన్నారు మంత్రి గంగుల కమలాకర్.
Gangula Kamalakar: రాష్ట్రంలో పెట్రోల్, డీజిల్ కొరత లేదు.. ఆ పుకార్లను నమ్మొద్దు..
Gangula Kamalakar: తెలంగాణలో పెట్రోల్, డీజిల్ కొరత లేనేలేదన్నారు మంత్రి గంగుల కమలాకర్. ప్రజలెవరూ పుకార్లను నమ్మొద్దని, భయాందోళనకు గురికావొద్దని ఆయన తెలిపారు. హైదరాబాద్ తో పాటు తెలంగాణ వ్యాప్తంగా పెట్రోల్, డీజిల్ కు గతంలో మాదిరిగానే డిమాండ్ ఉందన్నారు. రాష్ట్రంలోని 3 వేల 520 బంకుల్లో ఫుల్ స్టాక్ ఉందని మంత్రి స్పష్టం చేశారు. ఎక్కడైనా కృత్రిమ కొరత సృష్టిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని గంగుల హెచ్చరించారు. ఆయిల్ కంపెనీల ప్రతినిధులు, సివిల్ సప్లయిస్ అధికారులతో మంత్రి గంగుల సమీక్షా సమావేశం నిర్వహించారు.
Next Story




