Coronavirus: అసెంబ్లీ ఛాంబర్‌లో మంత్రి ఈటల కీలక వ్యాఖ్యలు

Coronavirus: తెలంగాణ అసెంబ్లీ ఛాంబర్‌లో వైద్యారోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్ కీలక వ్యాఖ్యలు చేశారు.

Arun Chilukuri
Published on: 25 March 2021 3:22 PM IST
Minister Etela Rajender Responds Over Rising Of Corona Cases
X

Coronavirus: అసెంబ్లీ ఛాంబర్‌లో మంత్రి ఈటల కీలక వ్యాఖ్యలు 

Coronavirus: తెలంగాణ అసెంబ్లీ ఛాంబర్‌లో వైద్యారోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్ కీలక వ్యాఖ్యలు చేశారు. తెలంగాణలో గత కొన్ని రోజులుగా కరోనా పాజిటివ్ కేసులు పెరుగుతున్నాయన్నారు. ఇన్‌ పెషెంట్ల సంఖ్య కూడా పెరుగుతోందని ఈటల అన్నారు. కరోనా టెస్ట్‌లు సంఖ్య పెంచాలని అధికారులకు సూచించమన్నారు. కోవిడ్ తీవ్రతపై అసెంబ్లీ చాంబర్‌లో మంత్రి ఈటలను పలువురు ఎమ్మెల్యేలు ఆరా తీశారు. ఈ నేపథ్యంలో మంత్రి ఈ కీలక వ్యాఖ్యలు చేశారు. కరోనా తీవ్రతపై ఉన్నతాధికారులతో ఫోన్ మాట్లాడి పరిస్థితిని మంత్రి తెలుసుకున్నారు. అయితే అంతగా తీవ్రత లేదని అధికారులు మంత్రికి వివరించారు.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story