మినీ మేడారం జాతర తేదీలు ప్రకటన

*ఫిబ్రవరి 24నుంచి 27వరకు అమ్మవార్లకు పూజా కార్యక్రమాలు *ఫిబ్రవరి 24న గుడిశుద్ధి, ఉదయం గ్రామ నిర్బంధన * 25న సమ్మక్క, సారాలమ్మలకు పసుపు, కుంకుమలతో అర్చన

Samba Siva Rao
Published on: 17 Jan 2021 4:43 PM IST
మినీ మేడారం జాతర తేదీలు ప్రకటన
X

ములుగు జిల్లాలో జరగనున్న మినీ మేడారం జాతర తేదీలను ఆలయ అధికారులు ప్రకటించారు. ఫిబ్రవరి 24నుంచి 27వరకు అమ్మవార్లకు పూజా కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు ఆలయ పూజారులు తెలియజేశారు. ఫిబ్రవరి 24న గుడిశుద్ధి, ఉదయం గ్రామ నిర్బంధన.. 25న సమ్మక్క, సారాలమ్మలకు పసుపు, కుంకుమలతో అర్చన కార్యక్రమం ఉంటుందన్నారు. అదేవిధంగా 26న అమ్మవార్లను దర్శించికునేందుకు భక్తులకు అనుమతి ఇవ్వనున్నట్లు తెలియజేశారు. ఇక ఈనెల 27న అమ్మవార్ల పూజ కార్యక్రమాలతో మినీ జాతర ముగింపు కార్యక్రమం జరుగుతుందని వెల్లడించారు.

Samba Siva Rao

Samba Siva Rao

Next Story