Hyderabad: కరోనా భయంతో స్వస్థలాలికి వెళ్లిపోతున్న వలసదారులు

Hyderabad: కరోనా భయంతో స్వస్థలాలికి వెళ్లిపోతున్న వలసదారులు
x

గ్రామాలకు వెళ్లిపోతున్నా వలసదారులు (ఫైల్ ఇమేజ్)

Highlights

Hyderabad: మళ్లీ లాక్డౌన్ ఆంక్షలు పెడతారనే వదంతులతో పల్లెబాట * అద్దెలు తగ్గిస్తామన్నా ఇంట్లో చేరని కిరాయిదారులు

Hyderabad: కరోనాకు ముందు నగరంలో అద్దె ఇల్లు కావాలంటే రోజుల తరబడి గల్లీ గల్లీ తిరగాల్సి వచ్చేది. అయినా అనుకున్న బడ్జెట్లో ఇల్లు దొరికేది కాదు. దీంతో ఖర్చులు తగ్గించుకుని కిరాయి ఎక్కువైనా అద్దెకు తీసుకునే వారు. ఇప్పుడు పరిస్థితులు మారాయి. నగరంలో ఎక్కడ చూసినా టు లెట్ బోర్డులే కనిపిస్తున్నాయి. మళ్లీ కొవిడ్ విజృంభిస్తుండడంతో జనం పల్లెబాట పడుతున్నారు. దీంతో మళ్ళీ నగరం ఖాళీ అవుతుంది.

కరోనా వైరస్ ఉధృతి కారణంగా గ్రేటర్ హైదరాబాద్ లో చాలా ప్రాంతాల్లో టు లెట్ బోర్డులు దర్శనమిస్తున్నాయి. హైదరాబాద్, సికింద్రాబాద్ జంట నగరాల్లో కరోనా భయంతో వలస జీవులు అందరూ స్వస్థలాలకు వెళ్లిపోవడంతో ఇళ్లు ఖాళీగా ఉన్నాయి. ఏడాది క్రితం కరోనా కారణంగా లాక్ డౌన్ తో ప్రజలు హైదరాబాద్ లో ఇంటి అద్దెలు చెల్లించలేక ఖాళీ చేసి సొంతూళ్లకు వెళ్లిపోయారు. దీంతో అప్పట్లో నగరంలో ఎటు చూసినా టు లెట్ బోర్డులే దర్శనమిచ్చాయి. అయితే కొన్ని నెలల అనంతరం పరిస్థితిలో కొంత మార్పు రావడం, వైరస్ ప్రభావం తగ్గడంతో మళ్లీ పల్లెల నుంచి పట్టణాలకు వలస బాట పట్టారు. ప్రస్తుతం కరోనా చాపకింద నీరులా పెరిగిపోతుండడం, మళ్లీ లాక్డౌన్ ఆంక్షలు పెడతారనే వదంతులు వ్యాప్తి చెందడంతో నగరానికి ఉపాధి నిమిత్తం వచ్చిన వారు తిరిగి గ్రామాలకు వెళ్లి పోతున్నారు.

ఒకప్పుడు టు లెట్ బోర్డు పెట్టిన కొద్ది వ్యవధిలోనే ఆ ఇంట్లో ఎవరో ఒకరు చేరేవారు. ఇప్పుడు టు లెట్ బోర్డు పెట్టి నెలలు గడుస్తున్నా ఎవరూ రాని పరిస్థితి ఏర్పడింది. అద్దెలు తగ్గిస్తామన్నా వచ్చేవారు కరువయ్యారు. ప్రముఖ విద్యా కేంద్రాలు కొలువుండే దిల్‌షుక్‌నగర్, అమీర్‌పేట్, అశోక్‌నగర్, కోఠి, ఎస్ఆర్‌నగర్ వంటి ప్రాంతాల్లో కూడా కరోనా ధాటికి ఇళ్లు ఖాళీగా మారాయి. హాస్టళ్లు సైతం చాలా వరకు మూతపడ్డాయి.

హైదరాబాదులో తాజాగా కరోనా సెకండ్ వేవ్ కారణంగా కేసులు గణనీయంగా పెరిగిపోగా రాబోయే రెండు నెలల్లో కరోనా విశ్వరూపం ప్రదరిస్తుందన్న ప్రచారంతో చాలా మంది ఇళ్లను ఖాళీ చేసి వెళ్లిపోతున్నారు.

కోటికి పైగా జనాభా ఉన్న భాగ్యనగరంలో సగానికి పైగా ఉద్యోగం, ఉపాధి అవకాశాల కోసం ఇతర ప్రాంతాల నుంచి వచ్చినవారే. అయితే ఇంకా లాక్‌డౌన్ ప్రారంభం కాలేదు కాబట్టి నగరంలో ఎక్కడా ఉపాది గానీ ఉద్యోగం గానీ లేదు అనే ప్రసక్తి మొదలవ్వలేదు. కానీ లాక్‌డౌన్ ఉంటుందనే భయంతో జనం పల్లెబాట పడుతున్నారు.

కరోనా కారణంగా చాలా మంది సొంతూళ్ల బాట పడుతున్నారు. ఇలా వెళ్లిన వారిలో చాలా మంది తిరిగి రావడానికి ఇష్టపడడం లేదు. చిరు వ్యాపారులు, దినసరి కూలీలు, ప్రైవేట్ ఉద్యోగులు, విద్యార్థులు అద్దె ఇల్లు ఖాళీ చేసి ఊళ్లకు వెళ్లిపోతున్నారు.

పేద, మధ్య తరగతి వారి సాధారణ గృహలకే కాదు అపార్ట్‌మెంట్లలోని ఫ్లాట్లలో ఇదే పరిస్ధితి కొనసాగుతుంది. ఈ పరిస్థితి ఇలాగే కొనసాగితే అద్దెలపై వచ్చే ఆదాయం రాకుండా పోయే ప్రమాదం ఉందని హౌస్ ఓనర్స్ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు,

ప్రస్తుతం ఇంటి అద్దెలు 30 నుంచి 40 శాతానికి తగ్గించారు. వర్క్ ఫ్రం హోమ్ కారణంగా సొంతూళ్లలో ఉండేందుకు ఎక్కువ మంది మక్కువ చూపుతున్నారు. గతంలో టు లెట్ బోర్డు ఉదయం పెడితే మధ్యాహ్నానికి బుక్ అయ్యిపోయేది. ఇప్పుడు రోజులు గడుస్తున్నా గేటు ముందు బోర్డు వేలాడుతూనే కనిపిస్తోంది. తక్కువ అద్దెకు ఇస్తామన్నా ఎవరూ రావడం లేదని ఇంటి యజమానులు వాపోతున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories